KP Sharma Oli: నేపాల్‌లో మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీని అరెస్ట్ చేసినట్లు సమాచారం. గతేడాది దేశంలో జెన్‌జీ (Gen Z) నిరసనలను హింసాత్మకంగా నర్రివేశారనే ఆరోపణలతో ఈ చర్య తీసుకున్నారు. ఈ అరెస్ట్ నూతన ప్రధానమంత్రి బాలేంద్ర షా ప్రమాణం చేసిన మరుసటి రోజు జరగడం విశేషం.భక్తపుర్‌లోని తన నివాసం నుంచి పోలీసులు కేపీ శర్మ ఓలీని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మాజీ హోంమంత్రి రమేశ్ లేఖక్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కొత్త హోం వ్యవహారాలశాఖ మంత్రి సుడాన్ గురంగ్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తూ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. చట్టానికి ఎవరూ అతీతులు కావరరాదు. మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ, మాజీ హోం మంత్రి రమేశ్‌ను అదుపులోకి తీసుకున్నాం.
వివరాలు
19 మంది యువకులు మృతి
ఇది ప్రతీకార చర్య కాదు, న్యాయ ప్రక్రియ ప్రారంభమేనని తెలిపారు. అరెస్ట్ సమయంలో ఓలీ మీడియాతో మాట్లాడుతూ, ఈ చర్యను కక్షపూరితంగా అభివర్ణించి, తాను న్యాయపోరాటం చేస్తానని అన్నారు. గతేడాదిలో సామాజిక మాధ్యమాలపై నిషేధంతో మొదలైన, అవినీతికి వ్యతిరేక ఉద్యమంగా నెపాల్‌లో పెద్ద ఎత్తున జెన్‌జీ ఆందోళనలు జరిగాయి. ఈ సందర్భంలో జరిగిన ఘర్షణల్లో 70 మంది పైగా, అందులో 19మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనల కారణంగా కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు పదవుల నుంచి రాజీనామా చేశారు. ఆ తర్వాత తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీల నియమితులు బాధ్యతలు స్వీకరించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బాలేంద్ర షా నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా ఎన్నికై శుక్రవారం ప్రమాణం చేశారు.
వివరాలు
దోషిగా తేలితే పది సంవత్సరాల పాటు జైలు శిక్ష
తరువాత మంత్రివర్గ సమావేశం నిర్వహించి, గత జెన్‌జీ ఉద్యమంపై దర్యాప్తు జరిపిన ఉన్నత స్థాయి కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని నిర్ణయించారు. కమిషన్ నివేదికలో ఆందోళనకారులపై కాల్పులు జరపమని ఆదేశాలు ఉన్నాయని రుజువు కాలేదని పేర్కొంది. కాల్పులను ఆపేందుకు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రయత్నించలేదని, వారి నిర్లక్ష్యం వల్ల మైనర్లు సహా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఆందోళనల సమయంలో నేపాల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఉన్న చంద్రకుబేర్ ఖాపుంగ్, ఇతర ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నివేదికలోని అంశాలను కేపీ శర్మ ఓలీ తిరస్కరించారు. కమిషన్ సిఫార్సుల ఆధారంగా కోర్టు విచారణలో వీరు దోషిగా తేలితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్షపడే అవకాశం ఉంది.