Hong Kong: హాంకాంగ్ నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం: నలుగురి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
హాంకాంగ్‌లోని ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. థాయ్ పొ ప్రాంతంలోని ఎత్తైన భవనాల్లో బుధవారం ఆకస్మికంగా మంటలు అంటుకోవడంతో చుట్టుపక్కల ప్రాంతం మొత్తం మందమైన పొగతో కప్పుకుపోయింది. ఆ కాంప్లెక్స్‌లో సుమారు 2,000 నివాస యూనిట్లు ఉన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు తెలిపాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది లోపలే చిక్కుకుపోయినట్లు వెల్లడించారు. హాంకాంగ్ స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 2.51 గంటలకి ఈ అగ్ని ప్రమాదంపై సమాచారం అందినట్టు ఫైర్ సర్వీసెస్ విభాగం వెల్లడించింది. ఈ ప్రమాదాన్ని నం.4 అలారం(severe fire emergency)గా అధికారులు ప్రకటించారు ఈ అత్యయిక పరిస్థితి ప్రకటించినప్పుడు పెద్ద ఎత్తున అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ ఇంజిన్లను అక్కడికి తరలించడం ఆనవాయితీ.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హాంకాంగ్ నివాస సముదాయంలో భారీ అగ్ని ప్రమాదం: నలుగురి మృతి
🔥🔥🔥 Honkonqun Tai Po bölgəsində bir neçə çoxmərtəbəli yaşayış binasını əhatə edən güclü yanğın baş verib.
— EurasiaDiary-Az (@EurasiaAz) November 26, 2025
Reuters-in məlumatına görə, binaların içərisində bir neçə nəfər hələ də bloklanmış vəziyyətdədir. #ednews #xeber #gündem #yangın #hongkong🇭🇰 #fypp #keșfet pic.twitter.com/yBn0Cu69yG