
Flights Cancelled: ఫ్రెంచ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సమ్మె.. 170 విమానాలను రద్దు..ఇబ్బందుల్లో 30 వేల మంది ప్రయాణికులు
ఈ వార్తాకథనం ఏంటి
ఫ్రాన్స్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది సమ్మెకు దిగిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భారీగా విమానాలను రద్దు చేశారు. ఈ సంఘటనతో వందల సంఖ్యలో విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. దాని ఫలితంగా వేలాది ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యాలను ఎదుర్కొంటున్నారు. ప్రసిద్ధ విమానయాన సంస్థ ర్యాన్ఎయిర్ తన 170 విమానాలను రద్దు చేసింది. దీని కారణంగా దాదాపు 30 వేల మందికి పైగా ప్రయాణికుల సెలవుల ప్రణాళికలు గందరగోళానికి గురయ్యాయి. ఫ్రాన్స్‌కు చెందిన రెండు యూనియన్లు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటూ రెండు రోజుల పాటు సమ్మె కొనసాగిస్తున్నాయి. ఆ దేశంలోని నాలుగో వంతు విమానాలు గ్రౌండ్ అయ్యాయి.
వివరాలు
ఉద్యోగుల సమ్మెపై ర్యాన్ఎయిర్ సంస్థ ప్రకటన
పారిస్, నీస్ విమానాశ్రయాల్లో ఎక్కడిక్కడే విమానాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ఫ్రాన్స్ రవాణా శాఖ మంత్రి ఫిలిప్ టబరాట్ మాట్లాడుతూ, యూనియన్‌లు చేసిన డిమాండ్లు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోదగినవిగా లేవని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిపై స్పందించిన ర్యాన్ఎయిర్ సంస్థ, ఇది కేవలం ఫ్రాన్స్‌కు వచ్చే విమానాలకే కాకుండా బ్రిటన్, ఐర్లాండ్, స్పెయిన్, గ్రీస్ దేశాలకు వెళ్లే విమానాలపైనా ప్రభావం చూపుతోందని వెల్లడించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఫ్రెంచ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సమ్మె.. 170 విమానాలను రద్దు
Ryanair says 170 flights have been cancelled across Europe due to a French air traffic controllers strike.
— Virgin Media News (@VirginMediaNews) July 3, 2025
30,000 passengers are affected, including those on 16 flights between Dublin and France.
Travellers are advised to check with their airlines for the latest updates. pic.twitter.com/hdpwa7WdBn