Pakistan: ఎర్రకోట నుండి కాశ్మీర్ వరకు'.. భారత్‌పై దాడులు చేస్తాం: పాక్ లీడర్ వ్యాఖ్యలు..
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తుందనే విషయం అంతర్జాతీయ సమాజానికి బాగా తెలిసినదే. తాజాగా ఎర్రకోటలో జరిగిన కార్‌బాంబు పేలుడుకూ పాకిస్తాన్ ఆధారిత జైషే మహ్మద్ సంస్ధకే సంబంధం ఉన్నట్లు భారత భద్రతా విభాగాలు నిర్ధారించాయి. ఇదే సమయంలో, పాకిస్తానీ నాయకుడు చౌదరి అన్వరుల్ హక్ బహిరంగంగానే తాము ఉగ్ర చర్యల్లో పాలుపంచుకుంటున్నట్టు అంగీకరించాడు. ''ఎర్రకోట నుంచి కాశ్మీర్ అడవుల దాకా భారత్ పై దాడులు కొనసాగిస్తాం'' అని వ్యాఖ్యానించాడు. ఆయన మాటలు ఇటీవల ఎర్రకోట దాడిని నేరుగా సూచిస్తున్నాయి. ఆ దాడిని ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ ఆత్మాహుతి రూపంలో జరిపి, 14 మంది ప్రాణాలు బలిగొన్నాడు. అతడు జైష్‌తో అనుబంధం ఉన్న వ్యక్తే.
వివరాలు
అల్లా అనుగ్రహంతో మేమది చేసి చూపాం
హక్ చేసిన ఈ వ్యాఖ్యలు ఎర్రకోట ఘటనతో పాటు జమ్మూ-కాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిని కూడా ప్రతిబింబిస్తున్నాయి. పహల్గామ్ సంఘటనలో 26 మంది టూరిస్టులు మరణించారు. లష్కరే తోయిబా అనుబంధ ప్రాక్సీ గ్రూప్ ''ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)'' ఈ దాడికి బాధ్యత వహిస్తోందని ప్రకటించింది. ప్రస్తుతం హక్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ''మీరు బలూచిస్తాన్‌ను అస్థిరపరచడం కొనసాగిస్తే,ఎర్రకోట నుంచి కాశ్మీర్ అడవుల వరకు భారతదేశాన్ని చీల్చేస్తామని ముందే చెప్పాను. అల్లా అనుగ్రహంతో మేమది చేసి చూపాం. వారు ఇప్పటికీ మృతదేహాల సంఖ్యనే చెప్పలేకపోతున్నారు'' అని ఆయన విరుచుకుపడ్డాడు.
వివరాలు
బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాల్లో జరుగుతున్న అశాంతికి భారత్ కారణమని ఆరోపణలు
ఇటీవల ఢిల్లీలోకి ఆయుధాలతో ప్రవేశించి దాడిచేసిన గుంపును కూడా ఆయన ప్రస్తావిస్తూ, ''ఇప్పటికీ వారు అక్కడ మృతదేహాల లెక్కపెట్టే పనిలో ఉన్నారు'' అని పేర్కొన్నాడు. ఇక పాకిస్తాన్ తరఫున బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతాల్లో జరుగుతున్న అశాంతికి భారత్ కారణమని ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. బలూచ్ స్వతంత్ర ఉద్యమానికి వేదికైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఎఫ్) పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండగా, ఖైబర్ ప్రాంతంలో పాక్ తాలిబాన్లు కూడా ఆ దేశ సైన్యానికి గట్టి కష్టాలు తెస్తున్నారు. సొంత దేశంలో అశాంతిని కట్టడి చేయలేని పాకిస్తాన్, ఆ నిందల్ని భారత్‌పై తోస్తోంది.