Page Loader
SIPRI: యుద్ధాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు ఆయుధాల విక్రయాలను పెంచుతున్నాయి: సిప్రి నివేదిక
యుద్ధాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు ఆయుధాల విక్రయాలను పెంచుతున్నాయి: సిప్రి నివేదిక

SIPRI: యుద్ధాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు ఆయుధాల విక్రయాలను పెంచుతున్నాయి: సిప్రి నివేదిక

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2024
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

గత ఏడాది ఉక్రెయిన్‌, గాజా యుద్ధాలు, ఇతర ప్రాంతీయ సంక్షోభాల కారణంగా ఆయుధ వ్యాపార కంపెనీల ఆదాయం భారీగా పెరిగింది. స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్ (SIPRI) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 100 ఆయుధ కంపెనీలు 2023లో 632 బిలియన్‌ డాలర్ల (రెండు లక్షల 53 వేల కోట్ల రూపాయలు) వ్యాపారం చేసినట్లు తెలిపారు. ఇది 2022 తో పోలిస్తే 4.2శాతం వృద్ధి చూపించింది. 2022లో చాలా ఆయుధ కంపెనీలు డిమాండ్ లో క్షీణతకు గురై కొన్ని మాంద్యాన్ని ఎదుర్కొన్నారు. అయితే, 2023లో వారి ఉత్పత్తిని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఏర్పడింది. SIPRI నివేదిక ప్రకారం,ప్రపంచంలోని 100ఆయుధ కంపెనీలకు కనీసం 1 బిలియన్‌ డాలర్ల వ్యాపారం సాధించిందని పేర్కొంది.

వివరాలు 

చిన్న కంపెనీల పాత్ర కీలకం

ఈ వృద్ధి 2024లో కూడా కొనసాగుతుందని SIPRI ఆయుధ ఉత్పత్తి నిపుణుడు లోరెంజో తెలిపాడు. గాజా, ఉక్రెయిన్, ఇతర ప్రాంతీయ సంక్షోభాల కారణంగా పుట్టిన డిమాండ్‌ను చిన్న ఉత్పత్తిదారులు ముందుపెట్టి పూరించారు. వీరు ప్రత్యేకమైన ఆయుధాలు లేదా సిస్టమ్స్ తయారు చేయడం ద్వారా ఈ డిమాండ్‌ను సంతృప్తిపరిచారు. సైనిక వ్యయ-ఆయుధ ఉత్పత్తి నిపుణుడు నాన్‌ టియాన్‌ ప్రకారం, ఈ ప్రాసెస్‌లో చిన్న కంపెనీల పాత్ర కీలకంగా మారింది. అమెరికాలో 100 పెద్ద ఆయుధ కంపెనీలలో 41 సంస్థలు ఉన్నాయనేది SIPRI నివేదికలో పేర్కొంది. ఈ కంపెనీలు గత ఏడాది 2.3 శాతం వృద్ధిని సాధించాయి. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ తయారీ సంస్థలు అయిన లాక్‌హీడ్‌ మార్టిన్‌(1.6) రేథియాన్‌ టెక్నాలజీస్‌ (1.3)ఆదాయం తగ్గింది.

వివరాలు 

రష్యా కంపెనీలు సగటున 40 శాతం వృద్ధి

ఈ కంపెనీలు అనేక దశల పంపిణీ వ్యవస్థలపై ఆధారపడినప్పటి నుంచి ఈ క్షీణత వచ్చింది. ఐరోపాలో 27 పెద్ద కంపెనీలు ఉన్నా,వీటి వృద్ధి కేవలం 0.2 శాతం మాత్రమే ఉండగా,ఇవి సంక్లిష్టమైన ఆయుధాలు తయారు చేయడంలో దృష్టిపెట్టాయి. పాత ఆర్డర్లను పూర్తి చేయకపోవడం కూడా దీనికి కారణంగా ఉంది.కొంతమంది కంపెనీలు ఉక్రెయిన్‌ యుద్ధానికి అవసరమైన ఆయుధాలను తయారుచేసి భారీగా లాభం పొందాయి. రష్యా కంపెనీలు సగటున 40 శాతం వృద్ధిని నమోదు చేసినప్పటికీ,ప్రభుత్వ రంగ సంస్థ అయిన రోస్‌టెక్‌ 49శాతం వృద్ధిని సాధించింది.

వివరాలు 

మూడు ఇజ్రాయెల్‌ కంపెనీలు రికార్డు

2023లో అక్టోబర్ 7 నాటి దాడుల అనంతరం పశ్చిమాసియాలో ఆయుధ కంపెనీల విక్రయాలు 18 శాతం పెరిగాయి. మూడు ఇజ్రాయెల్‌ కంపెనీలు 13.6 బిలియన్‌ డాలర్ల విక్రయాలతో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. తుర్కియే కంపెనీ అయిన బేకర్‌ 24 శాతం వృద్ధిని నమోదు చేసింది. చైనా కంపెనీల విక్రయాల్లో వృద్ధి లేకపోయినా,అవి మొత్తం 103 బిలియన్‌ డాలర్ల వ్యాపారం చేశాయి.