Knife attack in Germany: బాటసారులపై దాడిచేసిన నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు
పశ్చిమ జర్మనీలోని మోయర్స్ పట్టణంలో బాటసారులపై కత్తులతో దాడి చేసిన నిందితుడిని జర్మన్ పోలీసులు కాల్చి చంపారు. అంతకుముందు సోలింగెన్ పట్టణంలో ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ముగ్గురిని చంపిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం 2:45 గంటలకు పోలీసులకు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. మోయర్స్ పట్టణంలో ఒక వ్యక్తి బాటసారులపై కత్తులతో దాడి చేసినట్లు సమాచారం అందింది. 26 ఏళ్ల నిందితుడు రెండు కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు నిందితుడిని కాల్చి చంపారు.
హై అలెర్ట్ ను ప్రకటించిన జర్మనీ
ఇక సోలింగెన్ పట్టణంలో ఆగష్టు 24న జరిగిన కత్తి విధ్వంసంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఎనిమిది మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన జర్మనీలో హై అలర్ట్‌ను ప్రకటించింది. ఈ దాడి వెనుక ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 26 ఏళ్ల సిరియన్ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనల నేపథ్యంలో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ జర్మనీలో కత్తుల వినియోగంపై కఠినమైన చట్టాలను తీసుకొస్తామని ప్రకటించింది.