Telangana: పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లకు గుడ్‌న్యూస్.. ఫీజుల రద్దుతో నిర్మాణాలకు స్పీడ్!
ఈ వార్తాకథనం ఏంటి
పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన పలు రకాల ఫీజులను పూర్తిగా రద్దు చేయడంతో పాటు, అన్ని అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేలా సింగిల్ విండో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలు (EWS), అల్పాదాయ వర్గాలు (LIG) కోసం చేపట్టే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి, 2016లో రెండు పడక గదుల ఇళ్ల కోసం రూపొందించిన ప్రత్యేక మార్గదర్శకాలను అమలు చేయాలని తెలంగాణ గృహనిర్మాణ మండలి (TGHB) చేసిన ప్రతిపాదన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
వివరాలు
సింగిల్ విండో కమిటీకి కీలక బాధ్యతలు
ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులు ఒకే వేదికపై త్వరగా మంజూరు అయ్యేలా సింగిల్ విండో కమిటీ పనిచేయనుంది.
ఈ కమిటీలో. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి **చైర్పర్సన్**గా ఉంటారు.
తెలంగాణ గృహనిర్మాణ మండలి (TGHB) వైస్ చైర్మన్ **మెంబర్ కన్వీనర్**గా వ్యవహరిస్తారు.
రోడ్లు-భవనాల శాఖ (గృహనిర్మాణం) కార్యదర్శి, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్లు,
హెచ్ఎండీఏ కమిషనర్, కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,
డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ డీజీ పలువురు అధికారులు ఉంటారు.
అదనంగా సంబంధిత జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ లేదా జోనల్ కమిషనర్లు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులుగా పాల్గొంటారు.
వివరాలు
'బిల్డ్‌నౌ' ద్వారా దరఖాస్తుల పరిశీలన
ఇళ్ల నిర్మాణానికి వచ్చే దరఖాస్తులను **'బిల్డ్‌నౌ' (BuildNow)** ప్లాట్‌ఫారమ్ ద్వారా స్వీకరించే అధికారం కమిటీకి ఉంటుంది.
దరఖాస్తుల పరిశీలన అనంతరం...
నిర్ణీత గడువులో అనుమతులు,
నిరభ్యంతర పత్రాల (NOCలు) జారీ,
ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఒకేసారి దరఖాస్తుదారులకు సమాచారం,
అవసరమైన రుసుముల వసూలు లేదా మినహాయింపు,
వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం వంటి అన్ని బాధ్యతలను ఈ కమిటీ నిర్వహించనుంది.
అనేక ఫీజులకు పూర్తిగా మినహాయింపు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం పలు రకాల ఫీజులను పూర్తిగా రద్దు చేసింది.
వివరాలు
రద్దు చేసిన వాటిలో..
ప్రాసెసింగ్ ఫీజు,
డెవలప్మెంట్ ఛార్జీలు,
బెటర్మెంట్ ఛార్జీలు,
లేఅవుట్ అప్రూవల్ ఫీజు,
ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీలు,
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఫీజు,
సిటీ లెవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీజు వంటి అనేక రుసుములు ఉన్నాయి.
ఈవెసులుబాట్లు వీరికే?
ఈ రాయితీలు గృహనిర్మాణ మండలి అమలు చేసే పట్టణ ఇందిరమ్మ గృహనిర్మాణ పథకానికి మాత్రమే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే అవసరమైన చోట పర్యావరణ శాఖ, పౌర విమానయాన శాఖ వంటి సంస్థల నుంచి తీసుకోవాల్సిన అనుమతులకు మాత్రం ఎలాంటి మినహాయింపులు ఉండవని ఉత్తర్వుల్లో పేర్కొంది.
మొత్తం పట్టణ ఇందిరమ్మ గృహనిర్మాణ పథకానికి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించాలని ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ను ఆదేశించింది.