NEET Row: గ్రెటా థన్‌బర్గ్ మద్దతుతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారత విద్యార్థుల ఉద్యమం
ఈ వార్తాకథనం ఏంటి
భారత విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో మద్దతు లభించడం చర్చనీయాంశంగా మారింది. లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్‌ఐ-యూకే ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రముఖ వాతావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్ పాల్గొని భారత విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలు, ముఖ్యంగా నీట్ ప్రశ్నపత్రం లీక్ వివాదం నేపథ్యంలో భారత విద్యార్థులు న్యాయమైన, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ కోసం చేస్తున్న పోరాటాన్ని ఆమె అభినందించారు. ఈ ఉద్యమం ప్రజాశక్తికి నిదర్శనమని, ప్రపంచవ్యాప్తంగా సామాజిక ఉద్యమాల్లో పాల్గొనే వారికి కొత్త ఆశలను కలిగిస్తోందని గ్రెటా పేర్కొన్నారు.
వివరాలు
పోలీసులు చేపట్టిన అణచివేత చర్యలపై దేశ విదేశాల్లో విమర్శలు
భారత విద్యా వ్యవస్థలో వెలుగుచూస్తున్న లోపాలు,పోటీ పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలు, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడటం వంటి అంశాలు తన దృష్టిని ఆకర్షించాయని ఆమె వెల్లడించారు.
విద్యార్థుల సమస్యలు కేవలం ఒక దేశానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చించాల్సిన అంశాలుగా మారుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ప్రారంభమైన విద్యార్థుల ఉద్యమం అనంతరం పార్లమెంట్ ముట్టడి వరకు విస్తరించింది.
ఈ సందర్భంగా పోలీసులు చేపట్టిన అణచివేత చర్యలపై దేశ విదేశాల్లో విమర్శలు వ్యక్తమయ్యాయి.
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్ష,విద్యార్థులపై జరిగిన చర్యలు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాయి.
ఈపరిణామాల నేపథ్యంలో గ్రెటాథన్‌బర్గ్ స్వయంగా లండన్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ పాల్గొన్నారు.
వివరాలు
36 రోజుల పాటు ఉద్యమం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన ఈ ఉద్యమం 36 రోజుల పాటు కొనసాగింది.
ఈ చారిత్రాత్మక పోరాటానికి గ్రెటా థన్‌బర్గ్ మద్దతు ప్రకటించడంతో భారత విద్యార్థుల డిమాండ్లు అంతర్జాతీయ వేదికపై మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పారదర్శక పరీక్షా విధానం, విద్యార్థుల హక్కుల పరిరక్షణ, విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం కొనసాగుతున్న ఈ ఉద్యమానికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల నుంచి సంఘీభావం వ్యక్తమవడం విశేషంగా నిలిచింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
లండన్‌లో భారత విద్యార్థులకు అండగా నిలిచిన గ్రెటా థన్‌బర్గ్
Famous Social and Environment Activist Greta Thunberg showed up in solidarity with the Indian student movement at London protest organised by SFI-UK today. The student movement has given global activists hope about the power of the people.
— Adarsh.M.Saji (@Adarshmsaji) July 26, 2026
Thank You For your Solidarity… pic.twitter.com/VATlX9wvZo