LOADING...
Pakistan: పేశావర్‌లో పారామిలిటరీ కార్యాలయంపై దాడి
పేశావర్‌లో పారామిలిటరీ కార్యాలయంపై దాడి

Pakistan: పేశావర్‌లో పారామిలిటరీ కార్యాలయంపై దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2025
10:08 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో మంగళవారం భారీ ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పారా మిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. పెషావర్‌లో ఉన్న ఫ్రంట్రీయర్‌ కోర్‌ ప్రధాన కార్యాలయంపై దాడులు జరిగినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులు కార్యాలయం కాంపౌండ్‌లోకి చొరబడి వరుస పేలుళ్లకు పాల్పడినట్లు సమాచారం. అధికారుల వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున ఫ్రంట్రీయర్‌ కోర్‌ కార్యాలయం ప్రధాన గేటు వద్ద మొదటి పేలుడు జరిగింది. కొద్దిసేపటికే సమీప సైకిల్ స్టాండ్ దగ్గర మరో బాంబు పేలింది. ఘటనను గమనించిన భద్రతా సిబ్బంది, అక్కడికి చేరుకున్న ముగ్గురు దుండగులను ఎదుర్కొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పారా మిలిటరీ సిబ్బంది మరణించగా,నలుగురు గాయపడ్డారు. అందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పేశావర్‌లో పారామిలిటరీ కార్యాలయంపై దాడి

వివరాలు 

మొత్తం ప్రాంతం లాక్‌డౌన్

పేలుళ్ల తర్వాత రెస్క్యూ టీమ్‌లు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. మొత్తం ప్రాంతాన్ని లాక్‌డౌన్‌ చేసి భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ కూడా సమగ్ర పరిశీలన నిర్వహించింది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే, దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థా ముందుకు రాలేదు.