LOADING...
H-1B Visa: మార్చి 4 నుంచి హెచ్-1బి వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం
మార్చి 4 నుంచి హెచ్-1బి వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

H-1B Visa: మార్చి 4 నుంచి హెచ్-1బి వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 03, 2026
08:08 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో పని చేయాలనుకునే విదేశీ నిపుణులను లక్ష్యంగా ఇచ్చే హెచ్‌-1బీ వీసా విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వీసా రిజిస్ట్రేషన్ షెడ్యూల్‌ను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా ప్రకటించింది. అయితే ఈసారి అమల్లోకి వచ్చిన నిబంధనలు గత సంవత్సరాలతో పోలిస్తే మరింత కఠినంగా ఉండటం గమనార్హం. వీసా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ముఖ్య తేదీలు హెచ్-1బి వీసాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 మార్చి 4న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. దరఖాస్తులు స్వీకరించే చివరి తేదీ మార్చి 19. ఎంపికైన అభ్యర్థుల వివరాలను మార్చి 31న వెల్లడించనున్నారు.

వివరాలు 

భారీగా పెరిగిన ఫీజులు

ట్రంప్ ప్రభుత్వం 2025 సెప్టెంబర్‌లో అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, కొన్ని ప్రత్యేక హై-స్కిల్డ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అదనంగా 1,00,000 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 83 లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా అమెరికా వెలుపల నుంచి వీసాకు దరఖాస్తు చేసే వారికి ఈ నిబంధన తప్పనిసరి. దీని వల్ల నియామక సంస్థలపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఇదే సమయంలో ప్రాథమిక రిజిస్ట్రేషన్ ఫీజును కూడా 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు.

వివరాలు 

లాటరీకి బదులుగా 'వెయిటేజ్' విధానం

ఇప్పటివరకు అమల్లో ఉన్న రాండమ్ లాటరీ విధానాన్ని రద్దు చేసి,ఈసారి 'వెయిటేజ్' ఆధారిత ఎంపిక విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఎక్కువ వేతనం ఆఫర్ చేసే ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారికి వీసా దక్కే అవకాశాలు అధికంగా ఉంటాయి. నైపుణ్యం, అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం కల్పించడమే ఈ మార్పు వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దరఖాస్తు చేసే విధానం హెచ్-1బి వీసా కోసం నియామక సంస్థలు ముందుగా USCIS అధికారిక వెబ్‌సైట్‌లో అకౌంట్ సృష్టించి, తమ ఉద్యోగుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. లాటరీ లేదా వెయిటేజ్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థుల తరఫున మాత్రమే ఏప్రిల్ 1 నుంచి పూర్తి స్థాయి వీసా పిటిషన్లను దాఖలు చేయడానికి అవకాశం ఉంటుంది.

Advertisement

వివరాలు 

కోర్టు తీర్పు, కంపెనీల ఆందోళన

1,00,000 డాలర్ల అదనపు ఫీజు విధింపుపై అమెరికాలోని పలు ఐటీ సంస్థలు, వాణిజ్య మండళ్లు కోర్టును ఆశ్రయించాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికే కోర్టు మద్దతు ఇవ్వడంతో, ఈ ఏడాది దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా ఈ ఖర్చును భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చిన్న కంపెనీలు, స్టార్టప్‌లపై ఈ నిబంధన తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement