LOADING...
H-1B visa: హెచ్‌-1బీ వీసాదారులకు షాక్‌: వర్క్‌పర్మిట్‌ పునరుద్ధరణలో జాప్యం..! 
హెచ్‌-1బీ వీసాదారులకు షాక్‌: వర్క్‌పర్మిట్‌ పునరుద్ధరణలో జాప్యం..!

H-1B visa: హెచ్‌-1బీ వీసాదారులకు షాక్‌: వర్క్‌పర్మిట్‌ పునరుద్ధరణలో జాప్యం..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 22, 2025
08:52 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌కు తిరిగివచ్చిన హెచ్‌-1బీ వీసాదారులకు సంబంధించిన అమెరికా వర్క్‌పర్మిట్ల పునరుద్ధరణ ప్రక్రియ అనూహ్యంగా ఆగిపోయింది. అమెరికా కాన్సులర్‌ కార్యాలయాలు ఇప్పటికే ఖరారైన అపాయింట్‌మెంట్లను హఠాత్తుగా మారుస్తూ వాయిదా వేస్తున్నాయని వాషింగ్టన్‌ పోస్ట్‌ తన కథనంలో పేర్కొంది. డిసెంబర్‌ 15 నుంచి 26 మధ్య ఉన్న అపాయింట్‌మెంట్లను రీషెడ్యూల్‌ చేసినట్లు వెల్లడించింది. ఈ సమయంలో అమెరికాలో సెలవుల కాలం ఉండటం కూడా జాప్యానికి ఒక కారణంగా మారిందని తెలిపింది. ఇదిలా ఉండగా, అమెరికా విదేశాంగశాఖ మాత్రం ట్రంప్‌ పరిపాలన ప్రారంభించిన సోషల్‌ మీడియా వెట్టింగ్‌ విధానమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమని అభ్యర్థులకు ఈమెయిల్స్‌ ద్వారా తెలియజేసినట్లు ఆ పత్రిక పేర్కొంది.

వివరాలు 

 ఎఫ్‌, ఎం, జే కేటగిరీల దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా ఖాతాల పరిశీలన 

వీసా దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా ఖాతాలను మరింత లోతుగా పరిశీలిస్తున్నందునే అపాయింట్‌మెంట్లు వాయిదా పడుతున్నాయని సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. ఈ అంశంపై అమెరికా దౌత్య కార్యాలయ ప్రతినిధి స్పందిస్తూ, ఇప్పటికే విద్యార్థులు, ఎక్స్‌ఛేంజ్‌ వీసాలకు సంబంధించిన ఎఫ్‌, ఎం, జే కేటగిరీల దరఖాస్తుదారుల సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. అదే ప్రక్రియలో ఇప్పుడు హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసా దరఖాస్తుదారులను కూడా చేర్చామని స్పష్టం చేశారు. అదేవిధంగా అమెరికా విదేశాంగశాఖకు చెందిన ఒక అధికారి మాట్లాడుతూ, గతంలో వీసాల ప్రాసెసింగ్‌ను వేగంగా పూర్తి చేసి నిరీక్షణ సమయాన్ని తగ్గించడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టేవాళ్లమన్నారు.

వివరాలు 

ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్

అయితే ప్రస్తుతం భారత్‌తో పాటు అన్ని అమెరికా దౌత్య కార్యాలయాల్లో ప్రతి దరఖాస్తును విడివిడిగా, సవివరంగా పరిశీలించి ఆమోదం ఇస్తున్నామని వెల్లడించారు. అమెరికాలో ఉద్యోగం చేయడానికి జారీ చేసే 'ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌'ను సాధారణంగా వర్క్‌పర్మిట్‌గా పిలుస్తారని అధికారులు గుర్తు చేశారు.

Advertisement