LOADING...
Hamas: గాజా పాలక మండలిని రద్దు చేసిన హమాస్‌.. పరిపాలన కొత్త కమిటీకి
గాజా పాలక మండలిని రద్దు చేసిన హమాస్‌.. పరిపాలన కొత్త కమిటీకి

Hamas: గాజా పాలక మండలిని రద్దు చేసిన హమాస్‌.. పరిపాలన కొత్త కమిటీకి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2026
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

దాదాపు రెండు దశాబ్దాలుగా గాజా స్ట్రిప్‌ను పరిపాలిస్తున్న తమ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు హమాస్‌ ప్రకటించింది. అమెరికా మధ్యవర్తిత్వంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా గాజా పరిపాలనా బాధ్యతలను ఐక్యరాజ్యసమితి మద్దతుతో ఏర్పడనున్న టెక్నోక్రాటిక్‌ కమిటీకి అప్పగించనున్నట్లు వెల్లడించింది. ఈ పరిణామంలో భాగంగా హమాస్‌ ప్రభుత్వ ఎమర్జెన్సీ కమిటీ అధిపతి మహ్మద్‌ అల్‌-ఫర్రా తన పదవికి అధికారికంగా రాజీనామా చేసినట్లు సంబంధిత ప్రతినిధులు తెలిపారు. నూతన కమిటీకి పరిపాలనా బాధ్యతలను ఎలాంటి ఆటంకాలు లేకుండా బదిలీ చేసేందుకు పాలక మండలిని రద్దు చేసినట్లు వారు వివరించారు.

వివరాలు 

ఆయుధాలను అంతర్జాతీయ దళానికి అప్పగించే అంశంపై స్పష్టత ఇవ్వని హమాస్

ఇకపై గాజాలో పౌర పరిపాలనతో పాటు పునర్నిర్మాణ కార్యక్రమాలను పూర్తిగా నిపుణులతో కూడిన టెక్నోక్రాటిక్‌ కమిటీ పర్యవేక్షించనుంది. ఈ మార్పు ద్వారా పరిపాలన మరింత సమర్థంగా సాగుతుందని హమాస్‌ భావిస్తోంది. ఇజ్రాయెల్‌ సైన్యం గాజా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు మిగలకుండా చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హమాస్‌ ప్రతినిధి హాజెమ్‌ ఖాసిమ్‌ తెలిపారు. అయితే, తమ వద్ద ఉన్న ఆయుధాలను అంతర్జాతీయ దళానికి అప్పగించే అంశంపై మాత్రం హమాస్‌ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Advertisement