Hantavirus: హంటా వైరస్ కలకలం.. WHO కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ప్రయాణిస్తున్న విలాసవంతమైన క్రూయిజ్ నౌకలో హంటా వైరస్ కలకలం సృష్టించింది. వైరస్ ఆనవాళ్లు బయటపడడంతో 'ఎంవీ హోండియస్' నౌకలో ఉన్న సుమారు 150 మంది ప్రయాణికులు సముద్రంలోనే బందీల పరిస్థితిలో చిక్కుకుపోయారు. ఈ ప్రమాదకర ప్రయాణంలో ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా,మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందనే భయంతో కేప్ వెర్డే అధికారులు నౌకను తీరానికి చేరనివ్వలేదు. దీంతో నౌక సముద్రంలోనే నిలిచిపోయింది.ప్రయాణికులందరూ తమ గదులకే పరిమితమయ్యారు. వైద్య సిబ్బంది మాస్కులు,రక్షణ దుస్తులు ధరించి మాత్రమే బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటువ్యాధి నియంత్రణ కోసం అందరూ తమ గదులలోనే ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కఠిన ఆదేశాలు జారీ చేసింది.
వివరాలు
హెలెనా ద్వీపం నుండి జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్లిన విమానంలో 88 మంది ప్రయాణికులు
అనారోగ్యంతో ఉన్నవారిని ప్రత్యేకంగా నెదర్లాండ్స్‌కు తరలించి మెరుగైన చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఇక మరోవైపు, దక్షిణ అట్లాంటిక్‌లోని సెయింట్ హెలెనా ద్వీపం నుండి జోహన్నెస్‌బర్గ్‌కు వెళ్లిన విమానంలో ప్రయాణించిన 88 మంది ప్రయాణికులను గుర్తించే పనిలో ఆరోగ్య సంస్థ నిమగ్నమైంది. ఆ నౌకలో ప్రయాణించిన ఒక వ్యక్తి వైరస్ బారినపడి మరణించినట్లు వెల్లడించింది. అతడు సెయింట్ హెలెనా నుండి దక్షిణాఫ్రికాకు విమానం ఎక్కడానికి ముందు అదే నౌకలో ప్రయాణించినట్లు గుర్తించారు. దీంతో అతనితో ప్రయాణించిన ఇతరులను గుర్తించి, వారిని సంప్రదించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
వివరాలు
నౌకలో వైరస్ వ్యాప్తి క్రమం
ఏప్రిల్ 1, 2026 నౌక అర్జెంటీనాలోని ఉషుయా నుంచి ప్రయాణం ప్రారంభించింది. 20కు పైగా దేశాలకు చెందిన ప్రయాణికులు ఉన్నారు. ఏప్రిల్ 5-7, 2026 కొంతమందిలో జ్వరం, అలసట, కండరాల నొప్పులు వంటి లక్షణాలు కనిపించాయి. మొదట దీనిని సాధారణ వైరల్ వ్యాధిగా భావించారు. ఏప్రిల్ 10, 2026 నెదర్లాండ్స్‌కు చెందిన దంపతులు తీవ్ర స్థితికి చేరి మరణించారు. వైద్యులు హంటా వైరస్‌పై అనుమానం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 12-15, 2026 మరికొంతమందిలో శ్వాసకోశ సమస్యలు, మూత్రపిండాల వైఫల్య లక్షణాలు బయటపడ్డాయి. జర్మనీకి చెందిన ఒకరు మరణించగా, బ్రిటన్‌కు చెందిన మరో వ్యక్తి దక్షిణాఫ్రికాలో అత్యవసర చికిత్స విభాగంలో చేరాడు.
వివరాలు
నౌకలో వైరస్ వ్యాప్తి క్రమం
ఏప్రిల్ 18, 2026 నౌక కేప్ వెర్డే తీరానికి చేరుకున్నప్పటికీ, అక్కడి ప్రభుత్వం ప్రయాణికులను దిగనివ్వలేదు. ఏప్రిల్ 20-25, 2026 ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ యూనియన్ జోక్యం చేసుకున్నాయి. ప్రయాణికులు గదులకే పరిమితం కావాలని ఆదేశించారు. ఇద్దరు సిబ్బందికి అత్యవసర వైద్య సహాయం అవసరమని నౌక నిర్వాహకులు తెలిపారు. మే 1, 2026 స్పెయిన్‌కు చెందిన కానరీ దీవుల్లో నౌకను నిలిపేందుకు అనుమతి లభించింది. అక్కడ ప్రయాణికులు, సిబ్బందికి పరీక్షలు చేసి, చికిత్స అందించి, వారి స్వదేశాలకు పంపే చర్యలు చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు.