LOADING...
Hassan Khomeini: తదుపరి సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా ఖమేనీ మనవడు.. హసన్ ఖమేనీ ఎవరు? 
తదుపరి సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా ఖమేనీ మనవడు.. హసన్ ఖమేనీ ఎవరు?

Hassan Khomeini: తదుపరి సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా ఖమేనీ మనవడు.. హసన్ ఖమేనీ ఎవరు? 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 03, 2026
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పేరు హాట్ టాపిక్‌గా మారింది. హసన్ ఖమేనీ. దేశమంతా ఈ పేరే చర్చనీయాంశమైంది. ప్రతి వర్గంలోనూ, ప్రతి చర్చలోనూ ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఎవరు ఈ హసన్ ఖమేనీ? ఎందుకు ఇంత ప్రాధాన్యం దక్కుతోంది? ఇరాన్‌కు తదుపరి సుప్రీం లీడర్‌గా ఆయన పేరే ముందంజలో ఉందన్న వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సుప్రీం లీడర్ స్థానంలో ఉన్న ఖమేనీ తరువాత బాధ్యతలు చేపట్టే వ్యక్తిగా హసన్ ఖమేనీని ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. హసన్ ఖమేనీ మరెవరో కాదు,ఖమేనీ మనవడు. ఖమేనీకి మొత్తం 50 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు.

వివరాలు 

తాతకు తగ్గ మనవడిగా ప్రత్యేక గుర్తింపు

అయితే వారిలో అందరి కంటే ఎక్కువ ప్రజాదరణ పొందిన వ్యక్తి హసన్ ఖమేనీనేనని చెబుతున్నారు. తాతకు తగ్గ మనవడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఇరాన్ వర్గాలు పేర్కొంటున్నాయి. సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణానంతరం ఎవరు ఆ స్థానాన్ని చేపడతారన్న అంశంపై పలు పేర్లు చర్చకు వచ్చాయి. పోటీలో చాలామంది ఉన్నప్పటికీ, హసన్ ఖమేనీనే తదుపరి సుప్రీం లీడర్‌గా ఎంపికయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆయన ప్రభుత్వంలోని ఏ విభాగంలోనూ అధికారిక పదవి నిర్వహించలేదు. అయినప్పటికీ, ఖమేనీ మనవడిగా ఉండటం, వారసత్వ పరంగా ఆయనకు ఉన్న గుర్తింపు కారణంగా ఇరాన్ సైనిక, రాజకీయ వర్గాలు ఆయన వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

వివరాలు 

హసన్ ఖమేనీకి మొహమ్మద్ ఖతామీ, హసన్ రోహానీల మద్దతు

ఖమేనీకి ఉన్న మనవళ్లలో హసన్ ఖమేనీ కీలక వ్యక్తిగా భావిస్తున్నారు. ఇరాన్ భవిష్యత్ పునర్నిర్మాణానికి ఆయన నాయకత్వం అవసరమని కొందరు అభిప్రాయపడుతున్నారు. సంస్కరణ వాదులతో పాటు, మాజీ అధ్యక్షులు మొహమ్మద్ ఖతామీ, హసన్ రోహానీ లతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. వారి మద్దతు కూడా హసన్ ఖమేనీకి లభించే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇంకో ముఖ్య అంశం ఏమిటంటే, ఖమేనీ కుమారుడు మొహతాబాకు కూడా హసన్ ఖమేనీనే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ రాజకీయాల్లో హసన్ ఖమేనీ పేరు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

Advertisement