Loading...
Israel PM: నెతన్యాహు హెయిర్‌, మేకప్‌కు భారీ బిల్లు.. ఏడేళ్లలో రూ.4.49 కోట్లు!
నెతన్యాహు హెయిర్‌, మేకప్‌కు భారీ బిల్లు.. ఏడేళ్లలో రూ.4.49 కోట్లు!

Israel PM: నెతన్యాహు హెయిర్‌, మేకప్‌కు భారీ బిల్లు.. ఏడేళ్లలో రూ.4.49 కోట్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2026
10:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రులకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 2019 నుంచి 2026 వరకు ఆ దేశ ప్రధానుల హెయిర్‌ స్టైలింగ్‌, మేకప్‌తో పాటు అధికారిక కార్యక్రమాల్లో హుందాగా కనిపించేందుకు అవసరమైన దుస్తులు, ఇతర నిర్వహణ కోసం ప్రభుత్వం భారీగా ఖర్చు చేసినట్లు వెల్లడైంది. ఈ ఏడేళ్ల కాలంలో ఇందుకోసం మొత్తం 4.70 లక్షల డాలర్లు ఖర్చయినట్లు సమాచారం. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.4.49 కోట్లు. ప్రధాన మంత్రుల వ్యక్తిగత ఖర్చులకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించాలని కోరుతూ యారా వింక్లర్‌ షాలిట్ అనే న్యాయవాది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఇటీవల ఈ వివరాలను వెల్లడించింది.

వివరాలు

నెతన్యాహు, బెన్నెట్‌, లాపిడ్

అయితే గత ఏడేళ్లలో ప్రధానుల హెయిర్‌ స్టైలింగ్‌, మేకప్‌ తదితరాల కోసం చేసిన మొత్తం ఖర్చులో 90 శాతం నెతన్యాహు, ఆయన సతీమణి సారా కేశాలంకరణ, మేకప్‌ కోసమే ఖర్చు కావడం గమనార్హం. ఇజ్రాయెల్‌లో 2019 నుంచి 2026 వరకు బెంజమిన్‌ నెతన్యాహు, నఫ్తాలీ బెన్నెట్‌, యైర్‌ లాపిడ్ ప్రధాన మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు.

వీరిలో ప్రస్తుత ప్రధాని నెతన్యాహు ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగుతున్నారు.

2022లో ప్రధానులుగా ఉన్న నఫ్తాలీ బెన్నెట్‌, యైర్‌ లాపిడ్‌ మేకప్‌ కోసం సుమారు రూ.26 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. అదే 2023లో నెతన్యాహు కోసం ఏకంగా రూ.97 లక్షలు చెల్లించినట్లు వెల్లడైంది.

వివరాలు

విదేశీ పర్యటనల సమయంలోనూ భారీ ఖర్చు

అంతేకాకుండా ప్రధానుల జుట్టు, మేకప్‌ కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏటా గణనీయంగా పెరిగినట్లు తాజా వివరాలు సూచిస్తున్నాయి.

2025లో ఒక్క ఏడాదిలోనే సుమారు రూ.1.06 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది. 2023 అక్టోబరులో గాజాపై యుద్ధం ప్రారంభమైన సమయంలోనూ నెతన్యాహు హెయిర్‌, మేకప్‌ కోసం రూ.1.5 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడైంది.

నెతన్యాహు విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలోనూ హెయిర్‌ స్టైలింగ్‌, మేకప్‌ కోసం ప్రభుత్వం ఖర్చు చేసినట్లు సమాచారం.

గతేడాది ఫిబ్రవరిలో నాలుగు రోజులపాటు అమెరికాలో పర్యటించిన సమయంలో రూ.12.9 లక్షలు, అంతకుముందు ఏడాది వాషింగ్టన్‌ పర్యటన సందర్భంగా దాదాపు రూ.11 లక్షలు జుట్టు, మేకప్‌ కోసం ఖర్చు చేసినట్లు వెల్లడైంది.

ADVERTISEMENT

వివరాలు

ఇతర నిర్వహణల కోసం రూ.1.28 కోట్లు ఖర్చు

అలాగే నెతన్యాహు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో ధరించే దుస్తులు, ఇతర నిర్వహణ కోసం సుమారు రూ.1.28 కోట్లు ఖర్చయినట్లు సమాచారం.

అయితే భద్రతా కారణాలను చూపుతూ హెయిర్‌ స్టైలిస్టులు, మేకప్‌ ఆర్టిస్టుల వివరాలను ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించలేదు.

ప్రధానుల హెయిర్‌, మేకప్‌, దుస్తులు, ఇతర నిర్వహణ కోసం ప్రభుత్వ ఖర్చుల వివరాలు బయటకు రావడంతో ఇజ్రాయెల్‌లో ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి కార్యాలయంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT