Helicopter crash: కిలిమంజారో పర్వత ప్రాంతంలో కుప్పకూలిన హెలికాప్టర్.. ఐదుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
టాంజానియాలోని ప్రసిద్ధ కిలిమంజారో పర్వత ప్రాంతంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కూలిపోయి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కిలిమంజారో పర్వతంపై ఉన్న బరాఫు క్యాంప్ సమీపంలో బుధవారం ఈ దుర్ఘటన జరిగిందని టాంజానియా పౌర విమానయాన శాఖ అధికారికంగా వెల్లడించింది. పర్వత ప్రాంతంలో ఉన్న వ్యక్తులను వైద్య చికిత్స కోసం తరలిస్తున్న సమయంలో హెలికాప్టర్ కుప్పకూలినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విదేశీ పర్యాటకులు, ఓ వైద్యుడు, టూరిస్ట్ గైడ్ అలాగే హెలికాప్టర్ పైలట్ మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. అయితే, మృతిచెందిన పర్యాటకులు ఏ దేశానికి చెందినవారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కుప్పకూలిన హెలికాప్టర్
A Christmas Eve flight ended in devastation on the slopes of Africa's highest peak.A helicopter crash at Mount Kilimanjaro's Barafu Camp has claimed five lives, casting a shadow over the festive season and prompting an urgent investigation into the tragedy that unfolded in the… pic.twitter.com/xCxLKjGscf
— THEE ALFA HOUSE (@thee_alfa_house) December 25, 2025