Indonesia : ఇండోనేసియాలో కుప్పకూలిన హెలికాప్టర్.. 8 మంది మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 18, 2026
12:39 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం సంభవించింది. హెలికాప్టర్ కుప్పకూలి అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మృతిచెందారు. ఈ ప్రమాదం పశ్చిమ కాళిమంతన్ ప్రావిన్స్‌లో గురువారం చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మెలావి నుంచి బయలుదేరిన ఎయిర్‌బస్ H130 హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కంట్రోల్ రూమ్‌తో సంబంధాలు కోల్పోయిందని తెలిపారు. దీనితో అప్రమత్తమైన సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించాయి. టేకాఫ్ చేసిన ప్రాంతానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. అక్కడే అందులో ఉన్న వారి మృతదేహాలను కూడా వెలికితీశారు. ఈ ఘటనలో ఇద్దరు విమాన సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు.