Loading...
Helicopter Blast: కార్చిచ్చు ఆర్పుతుండగా గాల్లోనే ఢీకొన్న హెలికాప్టర్లు.. ఇద్దరు పైలట్లు మృతి
కార్చిచ్చు ఆర్పుతుండగా గాల్లోనే ఢీకొన్న హెలికాప్టర్లు.. ఇద్దరు పైలట్లు మృతి

Helicopter Blast: కార్చిచ్చు ఆర్పుతుండగా గాల్లోనే ఢీకొన్న హెలికాప్టర్లు.. ఇద్దరు పైలట్లు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2026
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

గ్రీస్‌లో అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపు చేసే క్రమంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంటలను ఆర్పేందుకు విధుల్లో ఉన్న రెండు అగ్నిమాపక హెలికాప్టర్లు (Fire Fighting Helicopters) గాలిలోనే ఒకదానికొకటి ఢీకొనడంతో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఆదివారం పశ్చిమ ఏథెన్స్‌ (West Athens) సమీపంలోని పసాతా తీర ప్రాంతంలో జరిగింది. సమాచారం ప్రకారం.. అటికా-బొయోటియా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగడంతో, మంటలను అదుపులోకి తీసుకురావడానికి గ్రీస్ ఫైర్ సర్వీస్‌కు చెందిన రెండు 'బెల్' హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు కొనసాగుతున్న సమయంలో రెండు హెలికాప్టర్లు అత్యంత సమీపంలోకి రావడంతో వాటి రోటార్లు (రెక్కలు) బలంగా ఢీకొన్నాయి

వివరాలు

ఘటనస్థలంలోనే మృత్యువాత

ఈ ఢీకొన్న ప్రభావంతో ఒక హెలికాప్టర్ గాలిలోనే పేలిపోయి నేలకూలింది.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.

అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరు పైలట్లను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

రెండు అగ్నిమాపక హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయినట్లు గ్రీస్ ఫైర్ డిపార్ట్‌మెంట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ వాసిలిస్ వత్రాకోగియానిస్ అధికారికంగా వెల్లడించారు. ఈ విషాద ఘటనపై గ్రీస్ ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పైలట్ల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ADVERTISEMENT