LOADING...
PM Modi: ప్రధాని మోదీకి ఇండోనేసియా అత్యున్నత పురస్కారం
PM Modi: ప్రధాని మోదీకి ఇండోనేసియా అత్యున్నత పురస్కారం

PM Modi: ప్రధాని మోదీకి ఇండోనేసియా అత్యున్నత పురస్కారం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2026
05:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోనేసియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ప్రతిష్ఠాత్మకమైన 'బిన్‌టాంగ్ ఆదిపూర్ణ' అవార్డుతో ఇండోనేసియా ప్రభుత్వం ఆయనను ఘనంగా సత్కరించింది. ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక పతకాన్ని ప్రధాని మోదీకి అందజేశారు. అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ఇండోనేసియాలో ఐఐఎం బెంగళూరు క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం భారత్-ఇండోనేసియా మధ్య విద్యా రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.Embed

వివరాలు 

ఇండోనేసియాకు బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి

ఇదే సందర్భంగా ఇరు దేశాలు వ్యూహాత్మక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించే దిశగా మరో కీలక అడుగు వేశాయి. ఇండోనేసియాకు బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి విక్రయానికి సంబంధించిన ఒప్పందంపై భారత్, ఇండోనేసియా ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని భావిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని మోదీకి ఇండోనేసియా అత్యున్నత పురస్కారం

Advertisement