
Canada: కెనడాలోని హిందూ ఆలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు దాడి
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలో సిక్కు వేర్పాటువాదులు మరోసారి అల్లర్లు సృష్టించారు.
ఏప్రిల్ 19న, ఖలిస్థాన్ జెండాలతో కనిపించిన వారు బ్రిటీష్ కొలంబియాలోని సర్రే పట్టణంలో ఉన్న శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
ఈ ఘటనలో ఆలయ ప్రధాన ద్వారం, పలు స్తంభాలు ధ్వంసమయ్యాయి.
శనివారం తెల్లవారు జామున సుమారు 3 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేస్తూ ఆలయంలోకి చొచ్చుకెళ్లారు.
వారు ద్వారాలు, స్తంభాలపై ఖలిస్థాన్‌కు మద్దతు తెలిపే రాతలు రాశారు.
ఈ దాడికి సంబంధించి ఆలయ కమిటీ స్పందిస్తూ... దుండగులు సీసీటీవీ కెమెరాలను అపహరించి, ఆధారాలను మాయం చేసే ప్రయత్నం చేశారని తెలిపారు.
వివరాలు
ద్వేషపూరిత చర్యలను ఖండిస్తున్నాం: ఆలయ నిర్వాహకులు
ఇలాంటి సంఘటనల వల్ల భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటాయని, ఇలాంటి ద్వేషపూరిత చర్యలను మేం తీవ్రంగా ఖండిస్తున్నామని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.
ఇక ఘటనపై కేసు నమోదైనట్లు స్థానిక పోలీసు శాఖ తెలిపింది.
దర్యాప్తు కొనసాగుతోందని, ఈ హింసాత్మక చర్యలకు భారత వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందేమో అన్న కోణంలో కూడా పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆలయ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని తెలిపారు.