LOADING...
Hinduja family: బ్రిటన్‌లో మరోసారి హిందూజాల హవా.. అత్యంత ధనిక కుటుంబంగా టాప్‌లో స్థానం
బ్రిటన్‌లో మరోసారి హిందూజాల హవా.. అత్యంత ధనిక కుటుంబంగా టాప్‌లో స్థానం

Hinduja family: బ్రిటన్‌లో మరోసారి హిందూజాల హవా.. అత్యంత ధనిక కుటుంబంగా టాప్‌లో స్థానం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 16, 2026
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

హిందూజా కుటుంబం మరోసారి బ్రిటన్‌లో అత్యంత సంపన్న కుటుంబంగా తమ స్థానాన్ని నిలబెట్టుకుంది. 2026 సంవత్సరానికి సంబంధించిన ది సండే టైమ్స్ విడుదల చేసిన 'రిచ్ లిస్ట్'లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. హిందూజా కుటుంబాధిపతి గోపీచంద్ హిందూజా గత ఏడాది మృతి చెందినప్పటికీ, కొత్త తరం సోదరుల నాయకత్వంలో కూడా కుటుంబం తన ఆధిపత్యాన్ని కొనసాగించడం విశేషంగా మారింది. సంజయ్ హిందూజా, ధీరజ్ హిందూజా కుటుంబం వరుసగా ఐదో ఏడాది బ్రిటన్‌లో అత్యంత ధనిక కుటుంబంగా నిలిచినట్లు జాబితా పేర్కొంది.

వివరాలు

పలు కీలక రంగాల్లో పెట్టుబడి

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, వ్యాపార రంగాల్లో అనేక ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ, గతేడాదితో పోల్చితే హిందూజా కుటుంబ సంపదలో 38 బిలియన్ పౌండ్ల (సుమారు రూ.4.8 లక్షల కోట్లు) మేర పెరుగుదల నమోదైనట్లు అంచనా వేయబడింది. హిందూజా గ్రూప్ డిజిటల్ టెక్నాలజీ, బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, మీడియా, హెల్త్‌కేర్ వంటి పలు కీలక రంగాల్లో పెట్టుబడులు పెట్టింది. ప్రస్తుతం ఈ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా 38 దేశాల్లో తన వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

Advertisement