Hinduja: తాము ఎలాంటి జైలుశిక్ష,నిర్బంధానికి గురికాలేదన్న హిందూజాలు
బ్రిటన్‌లోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు హిందూజాలు ఆదివారం నాడు తాము ఎలాంటి జైలుశిక్ష,నిర్బంధానికి గురికాలేదని చెప్పారు. ప్రకాష్ హిందుజా(78),అతని భార్య కమల్ హిందుజా(75),కుమారుడు అజయ్(56), అతని భార్య నమ్రత(50)లపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదిలా వుంటే వలస వచ్చిన సిబ్బందిపై వత్తిడి తెచ్చి బలవంతంగా పని చేయించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనితో పాటు వారికి వేతనాలు స్విస్ కరెన్సీలో కాకుండా భారత్ లో చెల్లుబాటు కాని రీతిలో ఇచ్చారని ప్రాసిక్యూటర్లు ఆరోపించిన సంగతి విదితమే. కాగా ఈ కధనాలు అవాస్తవమని హిందూజాల ప్రతినిధి ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యులను జైలులో పెట్టలేదని,వారిపై మానవ అక్రమ రవాణా ఆరోపణలను కొట్టివేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మాట మార్చిన వలస సిబ్బంది
స్విస్ చట్ట ప్రక్రియల ప్రకారం,అత్యున్నత న్యాయనిర్ణేత అధికారం ద్వారా వచ్చిన తుది తీర్పును అమలు చేసేంత వరకు నిర్దోషిత్వం చాలా ముఖ్యమైనది. కాబట్టి దిగువ కోర్టు తీర్పు అసమర్థమైనది,చెల్లుబాటు కాదని ఆ ప్రకటనలో వివరించింది.దీంతో "హిందూజా కుటుంబ సభ్యులపై వచ్చిన అత్యంత తీవ్రమైన అభియోగాలు,మానవ అక్రమ రవాణాను నిన్న కోర్టు పూర్తిగా కొట్టివేసింది. తమకు అర్థం కాని రీతిలో రూపొందించిన స్టేట్‌మెంట్‌లపై సంతకం చేశామని వారు కోర్టులో ప్రకటించారు. అలాంటి పనులకు తాము పాల్పడలేదని పిటిషన్ లో తెలిపారు.ఈ మేరకు వారంతా కోర్టు ముందు సాక్ష్యమిచ్చారు. నలుగురు హిందూజా కుటుంబ సభ్యులు తమను'గౌరవంగా కుటుంబసభ్యుల్లా 'చూసుకున్నారని న్యాయస్ధానం దృష్టికి తెచ్చారు.