Suicide blast: పాకిస్థాన్‌లో ఘోరం.. మసీదులో ఆత్మాహుతి దాడి, 16 మంది మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 18, 2026
05:27 pm
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. ఓ మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు. దాడి అనంతరం మసీదు ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
వివరాలు
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అయితే ఈ ఆత్మాహుతి దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థా బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు.