LOADING...
Bill Gates: ఎప్స్టీన్‌తో వృత్తిపరమైన సంబంధమే.. హౌస్ కమిటీ ఎదుట బిల్ గేట్స్ వాంగ్మూలం
ఎప్స్టీన్‌తో వృత్తిపరమైన సంబంధమే.. హౌస్ కమిటీ ఎదుట బిల్ గేట్స్ వాంగ్మూలం

Bill Gates: ఎప్స్టీన్‌తో వృత్తిపరమైన సంబంధమే.. హౌస్ కమిటీ ఎదుట బిల్ గేట్స్ వాంగ్మూలం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 24, 2026
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ జెఫ్రీ ఎప్స్టీన్ బాధితులతో నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. అయితే తాను కొన్ని సందర్భాల్లో వారి సమక్షంలో ఉండి ఉండొచ్చని అంగీకరించారు. అమెరికా హౌస్ ఓవర్‌సైట్ కమిటీ ముందు ఇటీవల జరిగిన క్లోజ్డ్-డోర్ ఇంటర్వ్యూ ట్రాన్స్‌క్రిప్ట్ మంగళవారం విడుదల కావడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. జెఫ్రీ ఎప్స్టీన్‌తో తనకు 2011 నుంచి కొన్ని సంవత్సరాల పాటు ఉన్న సంబంధం పూర్తిగా వృత్తిపరమైనదేనని గేట్స్ తెలిపారు. ఎలాంటి లైంగిక అక్రమ కార్యకలాపాలను తాను ప్రత్యక్షంగా చూడలేదని,వాటితో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు.

వివరాలు 

హౌస్ ఓవర్‌సైట్ కమిటీ విచారణ

అయితే కమిటీ సభ్యుడు రాబర్ట్ గార్సియా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎప్స్టీన్ వద్ద పనిచేసిన కొంతమంది మహిళలు కూడా బాధితులుగా ఉన్నారని తెలిసిందని, అందువల్ల తాను వారి సమక్షంలో ఉండి ఉండే అవకాశం ఉందని గేట్స్ అంగీకరించారు. ఒకసారి ఎప్స్టీన్ విమానంలో జరిగిన సమావేశం ముగిసిన తర్వాత అక్కడ కొందరు మహిళా ఉద్యోగులను చూశానని గేట్స్ తెలిపారు. "నేను బాధితుల సమక్షంలో ఉండి ఉండొచ్చు" అని ఆయన పేర్కొన్నారు. ఎప్స్టీన్‌తో ఉన్న సంబంధాలపై ఈ ఏడాది అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన అదనపు పత్రాల నేపథ్యంలో హౌస్ ఓవర్‌సైట్ కమిటీ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగానే గేట్స్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది.

వివరాలు 

ఎప్స్టీన్‌ "మాస్టర్ మానిప్యులేటర్"

ఇదే సమయంలో ఎప్స్టీన్‌కు చాలా కాలం వ్యక్తిగత సహాయకురాలిగా పనిచేసిన లెస్లీ గ్రాఫ్ వాంగ్మూలాన్ని కూడా కమిటీ విడుదల చేసింది. ఎప్స్టీన్‌ను ఆమె "మాస్టర్ మానిప్యులేటర్"గా అభివర్ణించారు. అతడి నేరాల గురించి తనకు తెలియదని చెప్పారు. దాదాపు పదేళ్ల కాలంలో ఎప్స్టీన్, అప్పటి వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్ మధ్య అనేకసార్లు ఫోన్ సంభాషణలు జరిగేలా తాను కలిపానని, అయితే వాటి విషయాల గురించి తనకు సమాచారం లేదని వెల్లడించారు. తన వాంగ్మూలంలో గేట్స్ మరో కీలక అంశాన్ని ప్రస్తావించారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారం, ముఖ్యంగా వివాహేతర సంబంధాల విషయాన్ని ఉపయోగించి ఎప్స్టీన్ తనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాడని చెప్పారు.

Advertisement

వివరాలు 

గేట్స్‌'కు ఎప్స్టీన్‌ ను పరిచయం డాక్టర్ బోరిస్ నికోలిక్

2014లో ఎప్స్టీన్‌తో సంబంధాలు తెంచుకున్న తర్వాత, ఒక మహిళకు సంబంధించిన ఖర్చుల కోసం "రీయింబర్స్‌మెంట్"చెల్లించాలని ఎప్స్టీన్ ఈమెయిల్ పంపాడని గుర్తు చేసుకున్నారు. అయితే ఎలాంటి చెల్లింపులు చేయబోమని తన సంస్థలోని కీలక వ్యక్తికి స్పష్టం చేశానని తెలిపారు. గేట్స్‌ను ఎప్స్టీన్‌కు పరిచయం చేసిన వ్యక్తి తన సన్నిహిత సహచరుడు డాక్టర్ బోరిస్ నికోలిక్ అని చెప్పారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను నికోలిక్ ఎప్స్టీన్‌కు చెప్పి ఉండొచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలిపారు. 2011లో ఎప్స్టీన్‌ను కలిసినప్పుడే అతనికి లైంగిక నేరాలకు సంబంధించిన శిక్ష ఉందని తనకు తెలుసని గేట్స్ వెల్లడించారు. అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాలకు భారీగా నిధులు సమీకరించగలనన్న ఎప్స్టీన్ మాటలను నమ్మి వృత్తిపరమైన సంబంధం కొనసాగించానని చెప్పారు.

Advertisement

వివరాలు 

ఎప్స్టీన్ తో సంబంధాలు కొనసాగించినందుకు ఇప్పుడు విచారం కలుగుతోంది: గేట్స్

ఎప్స్టీన్‌పై ఉన్న ఆరోపణలను అప్పట్లో మరింత సీరియస్‌గా తీసుకుని ఉండాల్సిందని, అతడితో సంబంధాలు కొనసాగించినందుకు ఇప్పుడు విచారం కలుగుతోందని గేట్స్ తెలిపారు. ఎప్స్టీన్ తనను వ్యక్తిగత దీవికి లేదా సామాజిక కార్యక్రమాలకు ఆహ్వానించినప్పటికీ, అతడి నేర చరిత్ర కారణంగా తాను ఆ హద్దు దాటలేదని గేట్స్ తెలిపారు. "అతని గురించి ఉన్న సమాచారం పట్ల నేను మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సింది" అని అన్నారు.

వివరాలు 

మసాజ్ అపాయింట్‌మెంట్‌లు అన్నీ ప్రొఫెషనల్ మసాజ్ థెరపిస్టులకేనని భావించ: లెస్లీ గ్రాఫ్

మరోవైపు లెస్లీ గ్రాఫ్ తన వాంగ్మూలంలో ఎప్స్టీన్ కోసం తాను బుక్ చేసిన మసాజ్ అపాయింట్‌మెంట్‌లు అన్నీ ప్రొఫెషనల్ మసాజ్ థెరపిస్టులకేనని భావించానని చెప్పారు. 2008లో ఎప్స్టీన్ జైలుశిక్ష అనుభవించిన తర్వాత అలాంటి అపాయింట్‌మెంట్‌లను క్రమం తప్పకుండా బుక్ చేయడం మానేశానని తెలిపారు. అయితే కమిటీ సభ్యులు ఆమె వాదనపై సందేహాలు వ్యక్తం చేస్తూ 2008 తర్వాత కూడా ఆమె కొన్ని అపాయింట్‌మెంట్‌లు బుక్ చేసిన రికార్డులను ప్రస్తావించారు.

Advertisement