
Iran-Isreal conflict: ఇరాన్ దాడిని ఐడీఏతో సమర్థవంతంగా తిప్పికొట్టిన ఇజ్రాయెల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆదివారం తెల్లవారు జాము నుంచి ఇరాన్ (Iran) దేశం ఇజ్రాయెల్ (Israel) పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.
అయితే ఇరాన్ దేశం ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్ క్షిపణుల ను ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పి కొట్టింది.
శత్రు దేశాల దాడులను తిప్పికొట్టేందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను సొంత చేసుకున్నఇజ్రాయెల్ తన రక్షణ వ్యవస్థ అమ్ముల పొదలో ఉన్న ఐడీఏ టెక్నాలజీతో ఇరాన్ దాడులను కూడా అంతే సమర్థవంతంగా తిప్పి కొట్టింది.
ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఐరన్ డోమ్ యారో సిస్టమ్ (ఐడీఏ), డేవిడ్ స్లింగ్, యారో డిఫెన్స్ సిస్టమ్ ద్వారా మధ్యలోనే కూల్చివేసింది.
ఇరాన్ క్షిపణులను ఇజ్రాయెల్ భూభాగానికి చేరుకోకముందే ఆకాశం మధ్యలోనే కూల్చివేసింది.
Iran attack
ఏమిటీ ఐడీఏ టెక్నాలజీ...
ఇజ్రాయెల్ ఏరో స్పేస్ ఇండస్ట్రీస్, అమెరికా మిస్సైల్ డిఫెన్స్ ఏజెన్సీ సహకారంతో యారో డిఫెన్స్ సిస్టమ్ ను ఉత్పత్తి చేసింది.
ఇది ఇజ్రాయెల్ మల్టీ లేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. యారో 1 సిస్టమ్ 1990 లో వినియోగంలోకి రాగా...యారో 2 సిస్టమ్ 2000 లో అందుబాటులోకి వచ్చింది.
ఆరో 3 సిస్టమ్ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గరే ఉంది.
యూరో సిస్టమ్ భూ వాతావరణం కన్నా ఎత్తునుంచి వచ్చే మిస్సైళ్లను కూడా అడ్డుకుంటుంది.
బాలిస్టిక్ క్షిపణులతో పాటు యెమెన్ లోని హౌతీ మిలిటెంట్లు ప్రయోగించే క్షిపణులను అడ్డు కుంటుంది.
Israel diffence
2400 కిలోమీటర్ల పరిధిని అందుకోగలదు
ఈ రక్షణ వ్యవస్థ విధానంలో క్షిపణి లాంచర్, ఈఎల్/ఎం 2080 గ్రీన్ పైన్ ఫైర్ కంట్రోల్ రాడార్ (ఎఫ్సీఆర్), హాజెల్ నట్ ట్రీ లాంచ్ కంట్రోల్ సెంటర్ (ఎల్సీసీ), సిట్రాన్ ట్రీ బ్యాటిల్ మేనేజ్ మెంట్ సెంటర్ ఉన్నాయి.
గ్రీన్ పైన్ ఫైర్ రాడార్ దీర్ఘ శ్రేణి లక్ష్యాన్ని గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఈ మిస్సైల్ లాచింగ్ వ్యవస్థ 14 లక్ష్యాలను ఛేదిస్తుంది. ఎఫ్ సీఆర్ వ్యవస్థల ఎలక్ట్రానిక్ జామింగ్ ను కూడా ఎదుర్కొంటుంది.
2400 కిలోమీటర్ల పరిధిని ఇది అందుకోగలదు.
100 కిలోమీటర్ల ఎత్తులోఉన్న లక్ష్యాలను ఛేదించగలదు.
డేవిడ్ స్లింగ్:
ఈ డేవిడ్ స్లింగ్ టెక్నాలజీ కూడా అమెరికా సహకారంతో రూపొందించారు.
IDA System Israel
స్వల్ప లక్ష్యాలను ఛేదించే ఐరన్ డోమ్ విధానం
ఈ టెక్నాలజీ ఇజ్రాయెల్ వైమానిక రక్షణ నిర్మాణంలో చాలా కీలకంగా పనిచేస్తోంది.
మధ్యస్థ శ్రేణి దాడులను లక్ష్యంగా చేసుకుంటుంది.
పేట్రియాట్ సిస్టమ్ :
పేట్రియాట్ సిస్టమ్ 1991 లో జరిగిన గల్ఫ్ యుద్ధం నుంచి వినియోగంలో ఉంది.
దీన్ని తొలుత ఇరాన్ నుంచి స్కడ్ క్షిపణులను అడ్డుకునేందుకు వినియోగించారు.
విమానాలు, డ్రోన్లను లక్ష్యంగా చేసుకుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఐరన్ డోమ్:
ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో ఐరన్ డోమ్ విధానం ప్రధానమైంది.
లెబనాన్ , పాలస్తీనా నుంచి ఎదురయ్యే స్వల్ప శ్రేణి రాకెట్ లను ఈ వ్యవస్థ సమర్థవంతంగా కూల్చివేస్తుంది.
ఐరన్ బీమ్:
ఇజ్రాయెల్ వాయు రక్షణ వ్యవస్థలో కీలకంగా పనిచేస్తుందీ ఐరన్ బీమ్.
ఇది అత్యాధునిక లేజర్ సాంకేతికతతో పనిచేస్తుంది.