Ismail Haniyeh: 2 నెలల ముందే బాంబు పెట్టి హత్య.. పక్కా ప్లాన్‌తోనే హనియాను చంపారు
రెండు రోజుల ముందు, హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియాను టెహ్రాన్ గెస్ట్‌హౌస్‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే. పక్కా ప్రణాళికతోనే బాంబు పెట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రెండు నెలల ముందే గెస్ట్ హౌస్ లో కి రహాస్యంగా బాంబులు తరలించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఓ నివేదిక తాజాగా బయటపెట్టింది. అతని అతిథి గృహం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన ఓ పెద్ద భవనంలో ఉంది. ఈ భవనాన్ని ఐఆర్‌జీసీ తమ రహాస్య సమావేశాలను ఉపయోగించుకోవడానికి వాడుకుంటుంది.
అవీవ్ పై ప్రత్యక్ష దాడికి సిద్ధం
నిత్యమూ ఐఆర్‌జీసీ బలగాలు ఈ ప్రాంతంలో పహారా కాస్తుంటాయి. దాదాపు రెండు నెలల కిందటే ఓ బాంబును రహాస్యంగా తీసుకొచ్చి దాటిపెట్టినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. మంగళవారం ఉదయం హనియా వచ్చినట్లు తెలుసుకొని తర్వాత హంతకులు రిమోట్ బాంబుతో పేల్చారు. ఈ పేలుడు తీవ్రత కారణంగా భవనం కొంతభాగం కూలినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో హనియా వ్యక్తిగత సహయకుడు కూడా మృతిచెందాడు. టెల్ అవీవ్‌పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశించినట్లు తెలిసింది.