Page Loader
Earthquake: నేపాల్-టిబెట్‌ సరిహద్దు భారీ భూకంపం.. 53 మంది మృతి
నేపాల్-టిబెట్‌ సరిహద్దు భారీ భూకంపం.. 53 మంది మృతి

Earthquake: నేపాల్-టిబెట్‌ సరిహద్దు భారీ భూకంపం.. 53 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 07, 2025
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దును భారీ భూకంపం వణికించింది. మంగళవారం ఉదయం 7.1 తీవ్రతతో జరిగిన ఈ భూకంపం కారణంగా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటివరకు టిబెట్‌లో కనీసం 53 మంది మరణించినట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. మరో 62 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగనున్నట్లు తెలిసింది. ఈ భూకంపం మంగళవారం ఉదయం 6:35 గంటలకు నేపాల్‌-టిబెట్‌ సరిహద్దు వద్ద ఉన్న లబుచె ప్రాంతంలో సంభవించింది. టిబెట్‌లోని షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించారు. తీవ్ర ప్రకంపనల కారణంగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Details

టిబెట్ లో మరో రెండు ప్రకంపనలు

భూకంపం అనంతరం టిబెట్‌లో మరో రెండు ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇవి 4.7, 4.9 తీవ్రతతో నమోదయ్యాయి. టిబెట్ ప్రాంతంలో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. భారత్‌లోనూ ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది. దిల్లీ-ఎన్‌సీఆర్‌, పశ్చిమ బెంగాల్‌, బిహార్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలిపారు. చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. చైనాలో భూకంప తీవ్రత 6.8గా నమోదైంది.