Iran: ఇరాన్‌కు భారీ షాక్.. రక్షణశాఖ మంత్రి అజీజ్ నసీర్జాదే మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 01, 2026
01:09 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడుల్లో ఇరాన్‌కు భారీ నష్టం సంభవించింది. ఈ దాడుల్లో ఇరాన్ రక్షణ శాఖ మంత్రి జనరల్ అజీజ్ నసీర్జాదే, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ అబ్దోల్ రహీమ్ మౌసావి మరణించినట్లు అధికారికంగా వెల్లడైంది. ఇరాన్ రక్షణ మండలి సమావేశాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఎయిర్ స్ట్రైక్‌లో ఈ ఇద్దరు ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ (ఐఆర్‌ఎన్‌ఏ) ఆదివారం ప్రకటించింది.
Details
పలువురు కమాండర్లు మృతి
జనరల్ నసీర్జాదే మరణంపై ఇప్పటికే అనధికారిక సమాచారం వెలువడినప్పటికీ, తాజాగా అధికారిక మీడియా దీనిని ధ్రువీకరించింది. అలాగే సాయుధ దళాలకు చెందిన పలువురు కమాండర్లు కూడా ఈ దాడిలో మృతి చెందినట్లు పేర్కొంది. వారి పేర్లను తర్వాత వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.