Hurricane Melissa: జమైకాను భయపెడుతున్న హరికేన్ మెలిసా!
ఈ వార్తాకథనం ఏంటి
కరేబియన్ ప్రాంతంలోని జమైకా దేశాన్ని హరికేన్ మెలిసా తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అమెరికా వాతావరణ నిపుణుల ప్రకారం, 'మెలిసా' తుపాను ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా నమోదైన హరికేన్లలో అత్యంత శక్తివంతమైనదిగా గుర్తించారు. ఈ తుపాను కేటగిరీ-5 హరికేన్‌గా వర్గీకరించబడింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఇది మంగళవారం తెల్లవారుజామున కరేబియన్ దీవుల తీరాన్ని తాకే అవకాశం ఉంది. జమైకాతో పాటు హైతీ, డొమినికన్ రిపబ్లిక్‌లలో కూడా నలుగురు మరణాలు సంభవించాయని సమాచారం. అమెరికా నేషనల్ హరికేన్ సెంటర్ (NHC) నివేదిక ప్రకారం,మెలిసా తుపాను ఈ సంవత్సరంలో భూమిపై నమోదైన అత్యంత బలమైన హరికేన్లలో ఒకటి.
వివరాలు
ప్రజలకు హెచ్చరికలు
ఈతుపాను ప్రభావంతో గంటకు 280కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఆ సంస్థ తెలిపింది. అలాగే భారీవర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే అవకాశం కూడా ఉందని ఎన్‌హెచ్‌సీ డైరెక్టర్ మైఖేల్ బ్రెన్నన్ హెచ్చరించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని,ఇంటినుంచి బయటకు రావొద్దని సూచించారు.తదుపరి నాలుగు రోజుల్లో జమైకాలోని కొన్ని ప్రాంతాల్లో సుమారు 100సె.మీవర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. వరదలతో హైతీలో వందలాది ఇళ్లు నీట మునిగిపోయాయి.జమైకా ప్రధానమంత్రి ఆండ్రూహోల్నెస్ ప్రజలకు కీలక సూచనలు ఇచ్చారు. ప్రతిఒక్కరూ ఇళ్లలోనే ఉండి,ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు. తుపాను తీవ్రతరం కావడంతో గ్రామీణప్రాంతాల ప్రజలను పాఠశాల బస్సుల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.