తదుపరి వార్తా కథనం

K P Oli : దేశం విడిచి పారిపోను : నేపాలి మాజీ ప్రధాని ఓలీ
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 29, 2025
10:40 am
ఈ వార్తాకథనం ఏంటి
తాజాగా నేపాల్‌లో (Nepal) జరిగిన జెన్-జెడ్ ఆందోళనల నేపథ్యంలో నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ (K P Sharma Oli) దేశం వీడి వెళ్లబోతున్నారనే వార్తలు వెలువడాయి. ఈ వార్తలపై ఓలీ స్పందిస్తూ, తమపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను దేశాన్ని విడిచి ఎక్కడికీ పారిపోను. ఎటువంటి ఆధారం లేని ప్రభుత్వానికి దేశాన్ని అప్పజెప్పి నేను పారిపోతానని మీరు అనుకుంటున్నారాని పార్టీ యువ విభాగాన్ని ప్రశ్నించారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం తన భద్రతా హక్కులు, అధికారిక హక్కులను రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు వారిని ఆరోపించారు.