తదుపరి వార్తా కథనం

Donald Trump: పుతిన్ యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు.. ట్రంప్ హెచ్చరిక!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 14, 2025
10:01 am
ఈ వార్తాకథనం ఏంటి
అలాస్కాలో శుక్రవారం జరగనున్న తమ భేటీ తర్వాత కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుద్ధాన్ని ఆపకపోతే, అత్యంత తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్ తరఫున భూభాగం విషయానికే చర్చలు పరిమితమవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ట్రంప్ చాలా స్పష్టమైన వైఖరి తీసుకున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ వెల్లడించారు. బుధవారం ట్రంప్ ఐరోపా నేతలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్‌స్కీ కూడా పాల్గొన్నారు. సమావేశ వివరాలను మెక్రాన్ మీడియాకు తెలియజేశారు. భవిష్యత్తులో ట్రంప్, పుతిన్, జెలెన్‌స్కీ త్రైపాక్షిక సమావేశం జరగాలని ట్రంప్ కోరుకుంటున్నారని మెక్రాన్ వెల్లడించారు. పుతిన్ మోసం చేస్తున్నారని ఈ సమావేశంలో జెలెన్‌స్కీ ఆరోపించారు.