Loading...
Alexander Lukashenko: ఉక్రెయిన్ రష్యాదే అయితే.. రష్యా మంగోలియాదే కదా..పుతిన్‌కు లుకాషెంకో కౌంటర్!
ఉక్రెయిన్ రష్యాదే అయితే.. రష్యా మంగోలియాదే కదా..పుతిన్‌కు లుకాషెంకో కౌంటర్!

Alexander Lukashenko: ఉక్రెయిన్ రష్యాదే అయితే.. రష్యా మంగోలియాదే కదా..పుతిన్‌కు లుకాషెంకో కౌంటర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఆయన సన్నిహితుడైన బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో ఊహించని వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ భూభాగం చారిత్రకంగా రష్యాదేనంటూ పుతిన్ చేస్తున్న వాదనలను పరోక్షంగా ఎద్దేవా చేశారు. అదే చరిత్రను ప్రాతిపదికగా తీసుకుంటే.. ఒకప్పుడు మంగోలుల పాలనలో ఉన్న రష్యాను ఇప్పుడు మంగోలియాకు తిరిగి ఇచ్చేయాలా? అంటూ ప్రశ్నించారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.

వివరాలు

కీవన్ రస్ నుంచే మూడు దేశాల ఆవిర్భావం

తాను చరిత్రకారుడినని చెప్పుకున్న లుకాషెంకో.. ప్రస్తుత ఉక్రెయిన్, రష్యా, బెలారస్ దేశాల చారిత్రక మూలాలను ప్రస్తావించారు.

క్రీ.శ. 9వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్య కొనసాగిన 'కీవన్ రస్' నుంచే ఈ మూడు దేశాలు ఆవిర్భవించాయని పేర్కొన్నారు.

ఒకప్పుడు ఈ భూభాగమంతా రష్యన్లదేనన్నది చారిత్రక వాస్తవమని తెలిపారు. అయితే చరిత్రను అదే కోణంలో పరిశీలిస్తే మరో అంశం కూడా గుర్తుంచుకోవాలని అన్నారు.

గతంలో రష్యాలోని పలు ప్రాంతాలు మంగోలులు, టాటార్ల ఆధీనంలో ఉండేవని గుర్తుచేశారు. అలాంటప్పుడు రష్యా భూభాగాన్ని కూడా మంగోలియాకు తిరిగి అప్పగించాలా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.

వివరాలు

పుతిన్‌తో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ప్రాధాన్యం

లుకాషెంకో వ్యాఖ్యలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఎందుకంటే ఆయనకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన సమయంలో రష్యా సైనిక బలగాలు తమ దేశ భూభాగాన్ని ఉపయోగించుకునేందుకు బెలారస్ అనుమతించింది.

అలాంటి మిత్రదేశ అధ్యక్షుడు ఇప్పుడు పుతిన్ చారిత్రక వాదనలను పరోక్షంగా ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు

యుద్ధంలో పుతిన్‌దే పైచేయి.. లుకాషెంకో వ్యాఖ్యలు

మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా సైన్యం నెమ్మదిగా ముందుకు సాగుతున్నప్పటికీ విజయం దిశగానే పయనిస్తోందని లుకాషెంకో అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధరంగంలో పుతిన్‌దే పైచేయి అని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

జెలెన్‌స్కీతో కలిసి మాస్కోకు వెళ్లేందుకు సిద్ధం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు తాను సిద్ధంగా ఉన్నానని లుకాషెంకో తెలిపారు. చర్చల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీతో కలిసి ఒకే విమానంలో మాస్కోకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు.

ఈ పర్యటనలో జెలెన్‌స్కీ భద్రతకు తాను హామీ ఇస్తానని చెప్పారు. ఒకవేళ జెలెన్‌స్కీ ఈ ప్రతిపాదనకు అంగీకరించకపోతే.. కలాష్నికోవ్ రైఫిల్ చేతబట్టి యుద్ధరంగంలోకి వెళ్లి పోరాడనివ్వండంటూ వ్యాఖ్యానించారు.

అయితే ఏదేమైనా రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని ఆయన ఆకాంక్షించారు.

ADVERTISEMENT