Loading...
Donald Trump: మధ్యంతర ఎన్నికల ప్రభావం.. వైట్‌హౌస్‌లో కీలక మార్పులు చేపట్టిన ట్రంప్
మధ్యంతర ఎన్నికల ప్రభావం.. వైట్‌హౌస్‌లో కీలక మార్పులు చేపట్టిన ట్రంప్

Donald Trump: మధ్యంతర ఎన్నికల ప్రభావం.. వైట్‌హౌస్‌లో కీలక మార్పులు చేపట్టిన ట్రంప్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 07, 2026
11:21 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఎదురుదెబ్బగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన తన అధికార బృందంలో కీలక మార్పులు చేపడుతున్నారు. తాజాగా వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా ఉన్న సుసీ వైల్స్‌ (Susie Wiles)ను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆమె స్థానంలో తనకు అత్యంత సన్నిహితుడైన స్టీఫెన్‌ మిల్లర్‌ (Stephen Miller)ను నియమించారు. ఈ విషయాన్ని ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. రాజకీయ వ్యూహకర్తగా గుర్తింపు పొందిన సుసీ వైల్స్‌.. 2024లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

వివరాలు

చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా నియామకం

ఆ తర్వాత అమెరికాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన పదవుల్లో ఒకటైన వైట్‌హౌస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా ఆమెను ట్రంప్‌ ఎంపిక చేశారు.

తద్వారా అమెరికా చరిత్రలో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా వైల్స్‌ రికార్డు సృష్టించారు. అయితే తాజాగా వెలువడిన మధ్యంతర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆమె పదవికి ట్రంప్‌ ఉద్వాసన పలికారు.

అయినప్పటికీ తన రాజకీయ బృందంలో వైల్స్‌ కొనసాగుతారని అధ్యక్షుడు స్పష్టం చేశారు.

ఇప్పటివరకు వైట్‌హౌస్‌ డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా పనిచేసిన స్టీఫెన్‌ మిల్లర్‌ను తాజాగా చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా నియమించినట్లు ట్రంప్‌ ప్రకటించారు.

వివరాలు

సుసీ వైల్స్‌ స్థానంలో స్టీఫెన్‌ మిల్లర్

మిల్లర్‌ చాలా కాలంగా ట్రంప్‌కు సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అమెరికా ప్రభుత్వ వలస విధానాల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు.

ముఖ్యంగా సరిహద్దు భద్రత, అక్రమ వలసదారుల దేశ బహిష్కరణ వంటి అంశాల్లో కఠినమైన విధానాల వెనుక మిల్లర్‌ పేరు ప్రముఖంగా వినిపించింది.

ట్రంప్‌ ప్రభుత్వంలో కీలక నిర్ణయాల రూపకల్పనలోనూ ఆయన ప్రభావం ఉంది. మరోవైపు, అమెరికా న్యాయశాఖలోనూ రాజీనామాల పరంపర కొనసాగుతోంది.

ఆ శాఖలో పౌర హక్కుల విభాగం చీఫ్‌గా పనిచేసిన హర్మీత్‌ థిల్లాన్‌ మధ్యంతర ఎన్నికల ఫలితాల తర్వాత తన పదవికి రాజీనామా చేశారు.

ADVERTISEMENT

వివరాలు

కొనసాగుతున్న రాజీనామాల పర్వం

ఆమెతో పాటు మరో ఇద్దరు కీలక అధికారులు కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

వారిలో న్యాయశాఖ జాతీయ భద్రతా విభాగానికి అధిపతిగా పనిచేసిన జాన్‌ ఐసెన్‌బర్గ్‌ ఒకరు.

మరొకరు ఫ్లోరిడాలోని సదరన్‌ డిస్ట్రిక్ట్‌ యూఎస్‌ అటార్నీగా విధులు నిర్వర్తించిన జాసన్‌ రెడింగ్‌. మధ్యంతర ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటమి ఎదురైనప్పుడు ప్రభుత్వంలోని కీలక పదవుల్లో మార్పులు, రాజీనామాలు చోటుచేసుకోవడం సాధారణమే.

అంతేకాకుండా ప్రభుత్వ విధానాలు, గతంలో తీసుకున్న నిర్ణయాలపై అమెరికా కాంగ్రెస్‌ కమిటీలు విస్తృత స్థాయిలో విచారణలు చేపట్టే అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యంలో కీలక అధికారులు బాధ్యతల నుంచి తప్పుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ADVERTISEMENT