LOADING...
Jemima Goldsmith: ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ఇమ్రాన్‌ఖాన్‌ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!
ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ఇమ్రాన్‌ఖాన్‌ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!

Jemima Goldsmith: ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ఇమ్రాన్‌ఖాన్‌ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 13, 2025
09:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్ బహిరంగ లేఖ రాశారు. తన ఎక్స్‌(X) ఖాతాలో అమలవుతున్న విజిబిలిటీ ఫిల్టరింగ్‌ను సరిచేయాలని ఆమె మస్క్‌ను కోరారు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి గురించి తాను చేస్తున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని ఆమె వెల్లడించారు. ఈ అంశంపై జెమీమా గోల్డ్‌స్మిత్ తన ఎక్స్ ఖాతాలోనే ఓ పోస్టు చేశారు. ఆ పోస్టులో ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. 'ఎలాన్ మస్క్‌కు ఇది ఒక వ్యక్తిగత విజ్ఞప్తి. చట్టవిరుద్ధంగా ఏకాంత నిర్బంధంలో ఉన్న తమ తండ్రిని కలిసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు నా ఇద్దరు కుమారులకు అనుమతి లేదు.

Details

తాము పెడుతున్న పోస్టులు బయటికి రావడం లేదు

ఈ పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయడానికి 'ఎక్స్' మాధ్యమం తప్ప మాకు మరో మార్గం లేదని ఆమె ఆ పోస్టులో పేర్కొన్నారు. పాకిస్థాన్ అధికారులు ఇమ్రాన్ ఖాన్ విషయంలో అనుసరిస్తున్న విధానంపై తాను పెడుతున్న పోస్టులు బయటకు రావడం లేదని జెమీమా ఆరోపించారు. అవి ప్రజలకు కనిపించడం లేదని, అందుకే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తన ఎక్స్ ఖాతాలోని విజిబిలిటీ ఫిల్టరింగ్ సమస్యను సరిచేయాలని ఆమె ఎలాన్ మస్క్‌కు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు.

Advertisement