US Citizenship: 2023లో 59,100 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
US Citizenship In 2023: అమెరికాలో సెటిల్ అవుతున్న భారతీయ పౌరుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. తాజాగా 2023లో అమెరికా పొరసత్వం పొందిన వారి జాబితాను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్( యూఎస్‌సీఐఎస్-USCIS) విడుదల చేసింది. పౌరసత్వం విషయంలో భారీతీయులకు అమెరికా అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. 2023లో మొత్తం 8.7 లక్షల మంది విదేశీ పౌరులకు అమెరికా పౌరసత్వం లభించగా.. అందులో భాతీయులు 59,000 మంది ఉన్నారు. 'అమెరికా పౌరసత్వం- 2023' జాబితాలో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. 1.1 లక్షల మందితో మెక్సికో మొదటి స్థానంలో ఉంది. ఈ జాబితాతో ఫిలిప్పీన్స్ 44,800తో మూడో స్థానంలో.. 35,200 మందితో డొమినికన్ రిపబ్లిక్ నాలుగో స్థానంలో ఉంది.
పౌరసత్వం పొందడానికి అర్హతలు ఏమిటి?
అమెరికాలో కనీసం 5 సంవత్సరాల పాటు చట్టబద్ధమైన శాశ్వత నివాసి (LPR)గా ఉండాలని యూఎస్‌సీఐఎస్ నిబంధనలు చెబుతున్నాయి. అమెరికా పౌరులను వివాహం చేసుకున్నా, లేక యూఎస్ సైన్యంలో పని చేసిన వారికి యూఎస్‌సీఐఎస్ కొన్ని రాయితీలను ప్రకటించింది. వీరు కేవలం మూడేళ్లలోనే అమెరికా పౌరసత్వం పొందడానికి అర్హులు అవుతారు. అయితే 2023లో అమెరికా పౌరసత్వం పొందినవారిలో అందరూ కూడా శాశ్వత నివాసి (LPR) కోటా కిందే ఎంపికైన వారని యూఎస్‌సీఐఎస్ పేర్కొంది. విదేశాల్లో స్థిరపడాలనుకునే భారతీయులు మొదటి ప్రాధాన్యతను అమెరికాకే ఇస్తారు. అందుకే అక్కడ స్థిరపడేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం భారతీయులు జనాభాపరంగా అమెరికాలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.