Page Loader
Thailand PM : థాయ్ లాండ్ ప్రధానిని పదవి నుంచి తొలగించిన కోర్టు
థాయ్ లాండ్ ప్రధానిని పదవి నుంచి తొలగించిన కోర్టు

Thailand PM : థాయ్ లాండ్ ప్రధానిని పదవి నుంచి తొలగించిన కోర్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2024
03:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

థాయిలాండ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏకంగా ఆ దేశ ప్రధానిపై అభియోగాలు రావడంతో ఆయనపై వేటు పడింది. నైతిక ఉల్లంఘనలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఆ దేశ ప్రధానిమంత్రి స్టెట్టా థావిపిన్‌ను అక్కడి కోర్టు పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయంటూ కోర్టు తీర్పునిచ్చింది.

Details

ప్రధాని పై అనర్హత వేటు

ఓ కోర్టు అధికారికి లంచం ఇవ్వడానికి యత్నించిన కేసులో జైలు శిక్ష అనుభవించిన క్యాబినెట్ సభ్యుడి నియామకానికి సంబంధించిన వ్యవహారంలో న్యాయస్థానం ఈ వేటు వేసింది. నేరారోపణలు ఉన్న వ్యక్తిని కేబినెట్లో‌ నియమించడం ద్వారా నైతిక ప్రమాణాల ఉల్లంఘన కిందికి వస్తుందన్నారు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష పార్టీని రద్దు చేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించిన కొన్ని రోజులకే ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటనలతో థాయ్‌లాండ్ రాజకీయాలు వేడక్కాయి.