Donald Trump:'ఏ తప్పు చేయనప్పుడు క్షమాభిక్షలు దేనికి?'.. అధ్యక్షుడైన తర్వాత ట్రంప్ తొలి ఇంటర్వ్యూ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు ఆసక్తికర విషయాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
క్యాపిటల్ ఘటన నిందితులకు క్షమాభిక్ష, టిక్‌టాక్ నిషేధం వంటి అంశాలపై ఆయన స్పందించారు.
అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఫాక్స్ న్యూస్ ఛానల్ ప్రతినిధి సీన్ హన్నిటితో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ట్రంప్‌కి అనేక ప్రశ్నలు వేయగా, ఆయన తన ప్రత్యేక శైలిలో సమాధానాలు ఇచ్చారు.
#1
1. టిక్‌టాక్ నిషేధంపై:
టిక్‌టాక్‌ను చైనాలో తయారు చేశారని, దాని ద్వారా అమెరికా యువతపై నిఘా పెట్టడం జరుగుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
కానీ, ఆయన మాట్లాడుతూ, "చైనాలో చాలా వస్తువులు తయారవుతున్నాయి, కానీ వాటిని ఎందుకు నిషేధించడం లేదు? యువత ఈ యాప్‌ను సరదా కోసం మాత్రమే వాడుతున్నారు" అని అన్నారు.
#2
2. క్యాపిటల్ హిల్ ఘటనపై:
2021 జనవరి 6న జరిగిన అమెరికా క్యాపిటల్ హిల్ భవనంపై దాడికి సంబంధించి ట్రంప్ 1,600 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు.
ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా, గత ఎన్నికల సమయంలో తన మద్దతుదారులను విడుదల చేస్తానని ఇచ్చిన హామీని ఆయన నెరవేర్చారు.
ట్రంప్ మాట్లాడుతూ, "ఎక్కువ మంది అమాయకులే ఈ ఘటనకు సంబంధించారు" అని చెప్పారు.
#3
3. బైడెన్‌పై విమర్శలు:
జో బైడెన్ తన అధికారాలను ఉపయోగించి తనకు, తన కుటుంబ సభ్యులకు క్షమాభిక్షలు పొందారని ట్రంప్ విమర్శించారు.
"నాకు కూడా ఈ అవకాశాలు కల్పించారు, కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే మేము ఎలాంటి తప్పు చేయలేదు. మా సొంత దేశభక్తిని చూపించాం" అని స్పష్టం చేశారు.
#4
4. ఓవల్ ఆఫీస్‌పై స్పందన:
"ప్రస్తుతం ప్రపంచంలో అనేక సంక్షోభాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, యుద్ధాలు వంటివి జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇక్కడ పని చేయాల్సిన అవసరం ఉంది" అని అన్నారు.
#5
5. లాస్ ఏంజెల్స్ కార్చిచ్చుపై:
లాస్ ఏంజెల్స్‌లో చోటుచేసుకున్న కార్చిచ్చుకు గవర్నర్ గావిన్ న్యూసోమ్‌ను ట్రంప్ నిందించారు.
"వాయువ్య రాష్ట్రాల నుంచి వచ్చే నీటిని విడుదల చేసి మంటలను ఆర్పడానికి ప్రయత్నించాల్సింది, కానీ అది చేయలేకపోయారు" అని విమర్శించారు.
#6
6. అక్రమ వలసదారులపై:
అమెరికాలో అక్రమ వలసదారుల్లో అధికంగా నేరస్తులు ఉన్నారని, ప్రపంచం నలుమూలల నుంచి 2 కోట్లకు పైగా నేరస్తులు అమెరికాకు అక్రమంగా వచ్చారని ఆయన తెలిపారు.
"ఇప్పుడు ప్రపంచంలోని జైళ్ళు ఖాళీ అవుతున్నాయి. వలస చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైన ఫెడరల్ ఫండ్స్‌ను కోత విధించాల్సి ఉంది" అని ట్రంప్ సూచించారు. #7 ఉగ్రవాదుల పెరుగుదలపై:
"దేశంలో ఉగ్రవాదుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరి లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది" అని ట్రంప్ అన్నారు.