Page Loader
70 year old woman: ఆశ్చర్యం.. కవలలకు జన్మనిచ్చిన 70 ఏళ్ల వృద్ధురాలు 
70 year old woman: ఆశ్చర్యం.. కవలలకు జన్మనిచ్చిన 70 ఏళ్ల వృద్ధురాలు

70 year old woman: ఆశ్చర్యం.. కవలలకు జన్మనిచ్చిన 70 ఏళ్ల వృద్ధురాలు 

వ్రాసిన వారు Stalin
Dec 02, 2023
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

70ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు తల్లి అయ్యింది. అది కూడా కవలలకు జన్మనిచ్చింది. ఇది ఎక్కడ జరిగింది? ఈ వయసులో ఇది ఎలా సాధ్యమైంది? తెలుసుకుందాం. ఉగాండా(Ugandan)లోని ఒక ఆసుపత్రిలో IVFచికిత్స తర్వాత 70ఏళ్ల వృద్ధురాలు కవలలకు జన్మనిచ్చింది. ఆ మహిళ పేరు సఫీనా నముక్వేయా. ఆమె కంపాలాలోని ఆసుపత్రిలో ఒక కుమార్తె, కొడుకుకు జన్మనిచ్చింది. బిడ్డకు జన్మనిచ్చిన అత్యంత వృద్ధ మహిళల్లో ఆమె ఒకరు. ఈ విషయాన్ని ఉమెన్స్ హాస్పిటల్ ఇంటర్నేషనల్ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ తన ఫేస్‌బుక్ పోస్టు చేసింది. ఇది ఒక అద్భుతం లాంటిదని పేర్కొంది. తల్లి, బిడ్డలు అందరూ క్షేమంగా ఉన్నారు. గత మూడేళ్లలో నముక్వాయాకు ఇది రెండో డెలివరీ. 2020లో కూడా ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 క్షేమంగా తల్లి, బిడ్డలు