LOADING...
Op Sindoor: 72 గంటల్లోనే భారత్‌కు ఆధిపత్యం.. పాకిస్తాన్ చేతులెత్తేసింది: అమెరికా నిపుణుడు
72గంటల్లోనే భారత్‌కు ఆధిపత్యం.. పాకిస్తాన్ చేతులెత్తేసింది:అమెరికా నిపుణుడు

Op Sindoor: 72 గంటల్లోనే భారత్‌కు ఆధిపత్యం.. పాకిస్తాన్ చేతులెత్తేసింది: అమెరికా నిపుణుడు

వ్రాసిన వారు Sirish Praharaju
May 06, 2026
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్ సిందూర్ మొదటి వార్షికోత్సవం ముందు ఆసక్తికర విశ్లేషణ బయటకొచ్చింది. అమెరికా సైనిక నిపుణుడు జాన్ స్పెన్సర్ ప్రకారం, ఈ ఘర్షణలో భారత్ వ్యూహాత్మకంగా పైచేయి సాధించింది. మొదటి గంటల్లో పాకిస్థాన్ కొంత టాక్టికల్ అడ్వాంటేజ్ సాధించినప్పటికీ, నాలుగో రోజుకే భారత్ వాయుసేన ఆధిపత్యాన్ని పూర్తిగా సాధించిందని చెప్పారు. పాకిస్థాన్ మాత్రం ఆపరేషన్లు కొనసాగించలేని స్థితికి చేరిందని ఆయన అబ్బరు. ఇది ఒక్క దాడి ఫలితం కాదని, పలు రోజుల పాటు శత్రు వైమానిక రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్ నిర్వహించిన ప్రణాళికాబద్ధమైన దాడుల ఫలితమని స్పష్టం చేశారు. మే 6-7 రాత్రి భారత్ పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయగా, తర్వాత పాకిస్తాన్ ప్రతిస్పందించింది.

వివరాలు 

సాంకేతిక సామర్థ్యంతో తిరిగి పైచేయి సాధించిన భారత్

దీనికి భారత్ తిరిగి పాకిస్తాన్ సైనిక స్థావరాలపై దాడులు జరిపింది. నాలుగు రోజుల పాటు సాగిన ఈ ఘర్షణ మే 10న పాకిస్తాన్ కోరిన కాల్పుల విరమణతో ముగిసింది. ఈ సమయంలో భారత్ పలు ఎయిర్‌బేస్‌లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను ధ్వంసం చేసింది. ముఖ్యంగా రాడార్ వ్యవస్థలు, క్షిపణి యూనిట్లపై దాడులు జరిపి పాకిస్తాన్ ఎదురుదాడి సామర్థ్యాన్ని దెబ్బతీసింది. ఆధునిక యుద్ధంలో కేవలం విమానాలు కాదు, మొత్తం వ్యవస్థల మధ్య పోరాటమే కీలకమని స్పెన్సర్ పేర్కొన్నారు. మొదట్లో ఎదురుదెబ్బ తిన్నా, భారత్ తన సాంకేతిక సామర్థ్యంతో తిరిగి పైచేయి సాధించి యుద్ధ వేగాన్ని నియంత్రించగలిగిందని ఆయన విశ్లేషించారు.

Advertisement