LOADING...
India-China: భారత్-చైనా వ్యాపార సంబంధాలు బలోపేతం.. ఫార్మా ఎగుమతులకు సుంకం 'జీరో'
భారత్-చైనా వ్యాపార సంబంధాలు బలోపేతం.. ఫార్మా ఎగుమతులకు సుంకం 'జీరో'

India-China: భారత్-చైనా వ్యాపార సంబంధాలు బలోపేతం.. ఫార్మా ఎగుమతులకు సుంకం 'జీరో'

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2025
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా సుంకాల దాడి, ట్రంప్ నిర్ణయాల మధ్య భారత్-చైనా వాణిజ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవల చైనాలో జరిగిన షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో ప్రధాని మోదీ, చైనా రాష్ట్రపతి జిన్ పింగ్‌ల మధ్య సమావేశాలు విశేష ఆకర్షణ సృష్టించాయి. చైనా భారత్‌కు ఘన స్వాగతం పలికింది. ఈ సమయంలో మోడీ, పుతిన్, జిన్ పింగ్ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా చైనా భారత్‌కు మంచి శుభవార్త తెలిపింది. అమెరికా 100 శాతం సుంకాలను విధించిన తర్వాత, చైనా భారతీయ ఫార్మా ఉత్పత్తులపై ఉన్న దిగుమతి సుంకాలను 30 శాతం నుండి సున్నా శాతానికి తగ్గించింది.

Details

కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదు

ఈ నిర్ణయం ద్వారా భారతీయ ఔషధ తయారీదారులు చైనాకు ఎగుమతి చేయడానికి ఎటువంటి కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేకుండా మందులను పంపవచ్చు. ఫలితంగా రాబోయే సంవత్సరాల్లో భారతీయ ఫార్మా ఎగుమతులు బిలియన్ డాలర్లకు చేరే అవకాశముందని నిపుణులు అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 100 శాతం సుంకాలను విధించిన వెంటనే చైనా ఈ నిర్ణయం తీసుకోవడం, భారతీయ ఫార్మాకు ప్రత్యామ్నాయ మార్కెట్ అందించడం, కంపెనీలకు సరసమైన ధరల్లో వ్యాపారం కొనసాగించడానికి దోహదపడుతుంది.

Details

 'ప్రపంచ ఫార్మసీ'గా పేరుగాంచిన భారతదేశం

భారతదేశం 'ప్రపంచ ఫార్మసీ'గా పేరుగాంచింది, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సుసరసమైన జనరిక్ మందులు, వ్యాక్సిన్లు సరఫరా అవుతున్నాయి. చైనా సుంకాలను సున్నా చేయడం, భారీ జనాభా ఉన్న ఆ దేశ మార్కెట్‌ను భారతీయ కంపెనీలకు అందించే అవకాశం కల్పిస్తోంది. వాణిజ్య విశ్లేషకులు ఈ నిర్ణయం భారత్-చైనా వాణిజ్య సంబంధాలను సమతుల్యంగా ఉంచే దిశగా కీలకమని భావిస్తున్నారు.