LOADING...
US: జైశంకర్-మార్కో రూబియో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ
జైశంకర్-మార్కో రూబియో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ

US: జైశంకర్-మార్కో రూబియో భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 23, 2025
08:38 am

ఈ వార్తాకథనం ఏంటి

టారిఫ్ సమస్యలతో భారత్-అమెరికా సంబంధాలు సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై లోతైన చర్చలు జరిగాయి. సుంకాల వివాదం కొనసాగుతున్న తరుణంలో ఈ భేటీని శుభ సూచక పరిణామంగా విశ్లేషిస్తున్నారు.

వివరాలు 

ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చ

న్యూయార్క్‌లో ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (UNGA) 80వ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు జైశంకర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్బంగా రూబియో ఆయనను కలిశారు. ఇరువురి మధ్య వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఔషధ పరిశ్రమ, వ్యూహాత్మక ఖనిజాలు వంటి ముఖ్యమైన రంగాలపై చర్చలు సాగాయి. ముఖ్యంగా, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చ జరగడం విశేషం. తరువాత, రూబియో తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ సమావేశంపై స్పందించారు. భారత్-అమెరికా శ్రేయస్సును పెంపొందించేందుకు, ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింతగా మెరుగుపరచేందుకు పలు అంశాలపై చర్చలు జరిగినట్లు ఆయన తెలిపారు. అలాగే, రెండు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అంగీకరించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.

వివరాలు 

రెండు దేశాల మధ్య క్షిణించిన సంబంధాలు

ఇక జైశంకర్ కూడా ఎక్స్‌లో స్పందించారు."సోమవారం ఉదయం న్యూయార్క్‌లో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోను కలవడం ఆనందంగా ఉంది. మా సంభాషణలో ద్వైపాక్షిక అంశాలతో పాటు అనేక అంతర్జాతీయ సమస్యలపై కూడా చర్చించాం"అని పేర్కొన్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై తొలుత 25 శాతం సుంకం విధించారు. తర్వాత, రష్యాతో భారత్‌ సంబంధాలు కొనసాగిస్తోందన్న కారణంతో మరో 25 శాతం సుంకాన్ని విధించినట్లు ప్రకటించారు. దీంతో మొత్తం 50 శాతం సుంకం భారత్‌పై పడింది. ఈ పరిణామాల వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అయితే, రైతుల ప్రయోజనాల కోసం ఎలాంటి భారమైన నిర్ణయం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మార్కో రూబియో చేసిన ట్వీట్ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జైశంకర్ చేసిన ట్వీట్