Loading...
IRAN: రాబోయే 48 గంటలు జాగ్రత్త.. ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక
రాబోయే 48 గంటలు జాగ్రత్త.. ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక

IRAN: రాబోయే 48 గంటలు జాగ్రత్త.. ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక

వ్రాసిన వారు Moogati Shabari
Apr 07, 2026
10:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై నేటి రాత్రి దాడులు జరగనున్నట్టు, ప్రపంచ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచిపోవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భారత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రతపై కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిలో, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. కేంద్రం సూచనల ప్రకారం, రాబోయే 48 గంటల్లో భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలని, అవసరంలేకుండా బయటకు వెళ్లవద్దని సూచించింది. ఈ సమయంలో, అమెరికా అధ్యక్షుడు కచ్చితమైన డెడ్‌లైన్ ప్రకటించడంతో, ఇరాన్‌లో ఉద్రిక్తతలు ఎక్కువయ్యాయి.

వివరాలు

రాయబార కార్యాలయం ఇచ్చిన ముఖ్య సూచనలివే

తదుపరి 48 గంటల పాటు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి.

అనవసరంగా బయటకు రాకండి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సైనిక స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి సున్నితమైన ప్రాంతాల నుంచి పూర్తిగా దూరంగా ఉండండి.

బహుళ అంతస్తుల భవనాల్లో నివసించే వారు పై అంతస్తులలో ఉండవద్దు.

ప్రయాణం తప్పనిసరి అయితే:

రాయబార కార్యాలయ అధికారులతో ముందుగా సమన్వయం చేసుకోవాలి.

ఇప్పటికే భారతీయుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాలు, హోటళ్లలో ఉన్న వారు తమ గదులను విడిచి బయటకు వెళ్లవద్దు.

అలాగే, అధికారులతో నిరంతరం టచ్‌లో ఉండాలని సూచన ఉంది.

వివరాలు

అత్యవసర సహాయ కోసం అందుబాటులో ఉండే మొబైల్ నంబర్లు:

+989128109115

+989128109102

+989128109109

+989932179359

ఇంకా cons.tehran@mea.gov.in ఈ-మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.

పరిస్థితులు వేగంగా మారవచ్చునని, అందువల్ల పౌరులు అధికారిక ప్రకటనలను నిరంతరం గమనిస్తూ ఉండాలని ఆదేశించింది.

ADVERTISEMENT