LOADING...
PM Modi: భారత్-న్యూజిలాండ్ 'వాకా' కొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉంది: మోదీ
భారత్-న్యూజిలాండ్ 'వాకా' కొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉంది: మోదీ

PM Modi: భారత్-న్యూజిలాండ్ 'వాకా' కొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉంది: మోదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2026
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌లోని ప్రతి ప్రాంతంలో భారతీయులు తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే స్వర్ణయుగానికి వీరే నిజమైన వారధులని పేర్కొన్నారు. అక్లాండ్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, మావోరీ భాషలోని 'వాకా' (Waka) అనే పదానికి ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. ''వాకా అంటే కేవలం ఒక పడవ మాత్రమే కాదు. అది కలిసి ముందుకు సాగే ప్రయాణానికి, ఐక్యతకు ప్రతీక. అదే స్ఫూర్తితో భారత్-న్యూజిలాండ్ 'వాకా' కూడా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది'' అని మోదీ అన్నారు.

వివరాలు 

న్యూజిలాండ్‌లో ఉన్నత స్థానంలో భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులు

భవిష్యత్తులో ఇరు దేశాలకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, వాటిని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులు న్యూజిలాండ్‌లో ఉన్నత స్థానాలను అధిరోహించడం గర్వకారణమన్నారు. నిఖిల్ రవిశంకర్ ఎయిర్ న్యూజిలాండ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదగడం, ఆనంద్ సత్యానంద్ గవర్నర్ జనరల్‌గా సేవలందించడం ఇందుకు నిదర్శనాలని చెప్పారు. క్రీడారంగంలోనూ భారతీయ మూలాలున్న రచిన్ రవీంద్ర, ఇష్ సోధి, అజాజ్ పటేల్ వంటి ఆటగాళ్లు న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో తమ ప్రతిభను చాటుతున్నారని మోదీ కొనియాడారు. అలాగే రగ్బీ క్రీడలో న్యూజిలాండ్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, ఆ రంగంలో భారత్ నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని అన్నారు.

వివరాలు 

క్రీడా సంబంధాలకు గుర్తుగా స్నేహపూర్వక ఫుట్‌బాల్ సిరీస్

రగ్బీ అభివృద్ధికి న్యూజిలాండ్ నిపుణులు, కోచ్‌ల సహకారం భారత్‌కు అవసరమని పేర్కొన్నారు. ఈ దిశగా భువనేశ్వర్‌లో 'న్యూజిలాండ్ రగ్బీ','రగ్బీ ఇండియా' భాగస్వామ్యంతో ఇప్పటికే ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. క్రీడలతో పాటు సాంకేతిక రంగంలోనూ భారత్, న్యూజిలాండ్ కలిసి మరిన్ని విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య శతాబ్దకాలంగా కొనసాగుతున్న క్రీడా సంబంధాలకు గుర్తుగా స్నేహపూర్వక ఫుట్‌బాల్ సిరీస్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు నవంబర్‌లో న్యూజిలాండ్ పర్యటన చేపట్టనుంది. నవంబర్ 12, 15 తేదీల్లో రెండు జట్ల మధ్య రెండు అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్‌లు జరగనున్నాయి.

Advertisement