Loading...
India Philippines Defence Deal: బ్రహ్మోస్‌తో పాటు ఆకాష్‌, పినాకాలపై ఆసక్తి చూపుతున్న ఫిలిప్పిన్స్
బ్రహ్మోస్‌తో పాటు ఆకాష్‌, పినాకాలపై ఆసక్తి చూపుతున్న ఫిలిప్పిన్స్

India Philippines Defence Deal: బ్రహ్మోస్‌తో పాటు ఆకాష్‌, పినాకాలపై ఆసక్తి చూపుతున్న ఫిలిప్పిన్స్

వ్రాసిన వారు Balachander Sharma
Nov 18, 2026
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనాతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు భారత్‌ వైపు చూస్తోంది. ఇప్పటికే బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులను కొనుగోలు చేసిన ఆ దేశం.. ఇప్పుడు మరో ఆరు బ్రహ్మోస్‌ బ్యాటరీలు, ఐదు కంటే ఎక్కువ ఆకాష్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ రెజిమెంట్లు, పినాకా రాకెట్‌ వ్యవస్థలను తీసుకునే దిశగా చర్చలు జరుపుతోంది. హెలికాప్టర్లు, అంతరిక్ష సహకారం, సైనిక శిక్షణ అంశాలు కూడా ఈ భాగస్వామ్యంలో భాగంగా ఉన్నాయి.

Details

మరో ఆరు బ్రహ్మోస్‌ బ్యాటరీలపై చర్చలు

బ్రహ్మోస్‌ క్షిపణులను కొనుగోలు చేసిన తొలి విదేశీ దేశం ఫిలిప్పీన్సే. ఇప్పటికే మూడు బ్యాటరీలను అందుకున్న ఆ దేశం వాటి పనితీరుపై సంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.దీంతో మరో ఆరు బ్యాటరీల కొనుగోలుపై ఆసక్తి చూపుతోంది.

ఆపరేషన్‌ సిందూర్‌లో బ్రహ్మోస్‌ క్షిపణుల పనితీరును వివరించిన తర్వాత ఫిలిప్పీన్స్‌ పంపిన సమాచార అభ్యర్థనకు బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ స్పందించినట్లు తెలుస్తోంది.

అంతేకాదు, ఫిలిప్పీన్స్‌ నౌకాదళ నౌకలపై కూడా ఈ క్షిపణులను అమర్చే అవకాశాన్ని భారత్‌ ప్రతిపాదించింది.

Details

ఆకాష్‌, పినాకా వ్యవస్థలపైనా ఆసక్తి

బ్రహ్మోస్‌తో పాటు ఆకాష్‌ వైమానిక రక్షణ వ్యవస్థలను తమ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ కోసం కొనుగోలు చేయడంపై ఫిలిప్పీన్స్‌ చర్చిస్తోంది.

ఆపరేషన్‌ సిందూర్‌లో ఆకాష్‌ పనితీరుపై అక్కడి రక్షణ అధికారులకు ప్రజెంటేషన్‌ ఇచ్చినట్లు సమాచారం.

అయితే ఫిలిప్పీన్స్‌ వైమానిక దళం మరింత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల వ్యవస్థలపైనా దృష్టి పెట్టింది.

మరోవైపు ఆర్మీ కోసం భారత పినాకా మల్టీ బ్యారెల్‌ రాకెట్‌ లాంచర్‌ను కూడా పరిశీలిస్తోంది.

ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక నిబంధనలపై చర్చలు కొనసాగుతున్నాయి.

ADVERTISEMENT

Details

రూ.1,400 కోట్ల బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్ల ఒప్పందం

క్షిపణులకే పరిమితం కాకుండా రక్షణ తయారీ రంగంలోనూ రెండు దేశాల మధ్య సహకారం పెరుగుతోంది.

భారత సంస్థ MKU ఫిలిప్పీన్స్‌లో బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఫిలిప్పీన్స్‌ ఆర్మీకి రక్షణ పరికరాలు సరఫరా చేసేందుకు సుమారు రూ.1,400 కోట్ల ఆర్డర్‌ దక్కించుకుంది.

ఒప్పందంలోని చివరి విడత జాకెట్లను స్థానికంగానే తయారు చేయాల్సి ఉంది. హెలికాప్టర్ల కొనుగోలుపైనా ఫిలిప్పీన్స్‌ ప్రాథమిక చర్చలు జరుపుతోంది.

ADVERTISEMENT

Details

అంతరిక్షం, సైనిక శిక్షణలోనూ భాగస్వామ్యం

ఫిలిప్పీన్స్‌లో పలు ప్రాంతాల్లో పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేసి, భారత ఉపగ్రహాల చిత్రాలను అందించే ప్రతిపాదనను కూడా భారత్‌ ముందుకు తెచ్చింది.

దీనివల్ల దక్షిణ చైనా సముద్రంలో నౌకల కదలికలను పర్యవేక్షించే సామర్థ్యం ఫిలిప్పీన్స్‌కు పెరుగుతుంది.

అలాగే ఇరు దేశాల సైనికులు సంయుక్త విన్యాసాల్లో పాల్గొనేందుకు వీలుగా Visiting Forces Agreementపై చర్చలు జరుగుతున్నాయి.

భారత నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, ఇండియన్‌ మిలిటరీ అకాడమీల్లో ఫిలిప్పీన్స్‌ సైనిక క్యాడెట్లకు శిక్షణ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.

మొత్తంగా ఆయుధ కొనుగోళ్లను దాటి దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యంగా సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్‌, ఫిలిప్పీన్స్‌ భావిస్తున్నాయి.

ADVERTISEMENT