Gurupatwant singh-America-Raw: ఖలీస్థాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ వ్యవహారంలో అమెరికా మీడియాపై భారత్ మండిపాటు
ఈ వార్తాకథనం ఏంటి
ఖలీస్తాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ (Gurupatwant singh) - రా (Raw) అధికారి విక్రమ్ యాదవ్ ఎపిసోడ్ పై అమెరికా మీడియా ప్రచురించిన కథనాలపై భారత్ తీవ్రంగా మండిపడింది.
అమెరికాలో ఉంటున్నఖలీస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ను హత మార్చేందుకు భారత్‌లోని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) మాజీ అధికారి విక్రమ్ యాదవ్ ప్రత్యేక టీమ్‌ను నియమించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది.
ఈ కథనం పూర్తి నిరాధారమని, అసమర్థనీయమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ (Randheer Jaiswal) తెలిపారు.
వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనం బాధ్యతారహితమైనదని, ఊహాజనితమైనది ఆయన మండిపడ్డారు.
Gurupatwanth singh-America
గతంలోనూ ఇవే కథనాలు..
నవంబర్ 2022లో ఉద్రిక్తతలు చెలరేగిన తర్వాత పన్నూన్‌ను హత్య చేసే కుట్రను అమెరికా తిప్పికొట్టిందని ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.