Helpline Numbers: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు: భారతీయుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్.. హెల్ప్‌లైన్ నంబర్‌లు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు మరింత పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా పశ్చిమాసియా దేశాలు మరియు గల్ఫ్ ప్రాంతాల్లో నివసిస్తున్న అనేక మంది భారతీయులు అక్కడే చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారత పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని భారత విదేశాంగ శాఖ (MEA) ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయులకు సహాయం అందించేందుకు స్పెషల్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.
వివరాలు
కంట్రోల్ రూమ్ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుంది
అదే సమయంలో అక్కడ ఉన్న భారతీయులు అవసరమైన సమయంలో సంప్రదించేందుకు విదేశాంగశాఖ పలు హెల్ప్‌లైన్ నంబర్లను కూడా విడుదల చేసింది.
ఈ కంట్రోల్ రూమ్ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తుందని అధికారులు వెల్లడించారు.
సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు: టోల్ ఫ్రీ: 1800118797 ఫోన్: +91 11 2301 2113 ఫోన్: +91 11 2301 4104 ఫోన్: +91 11 2301 7905
అత్యవసర నంబర్లు
ప్రస్తుతం ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రాంతాల్లో ఉన్న భారతీయులు తమకు అవసరమైన సహాయం కోసం అక్కడి భారత రాయబార కార్యాలయాలను కూడా సంప్రదించవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఇందుకోసం ప్రత్యేకంగా అత్యవసర సంప్రదింపు నంబర్లను కూడా విడుదల చేసింది.
వివరాలు
అత్యవసర సంప్రదింపు నంబర్లు
బహ్రెయిన్: +973 39418071
ఇరాన్: +98 9128109115, +98 9128109102, +98 9128109109, +98 9932179359
ఇరాక్: +964 771 651 1185, +964 770444 4899
ఇజ్రాయెల్: +972 54 7520711, +972 54 2428378
జోర్డాన్: +962 770 422 276
కువైట్: +965 65501946
లెబనాన్: +961 76860128
ఒమన్: +968 98282270 (వాట్సప్),80071234 (టోల్ ఫ్రీ)
ఖతార్: +974 55647502
రమల్లా, పాలస్తీనా: +970 592916418
సౌదీ అరేబియా (రియాద్): +966 11 4884697, 800 247 1234 (టోల్ ఫ్రీ),
సౌదీ అరేబియా (జెడ్డా): +966 126648660, +966 12 2614093
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: +971 543090571 (వాట్సాప్), 800 46342 (టోల్ ఫ్రీ)