Loading...
Pia Dandia: అమెరికా కాంగ్రెస్ బరిలో భారత సంతతి విద్యావేత్త పియా దాండియా రికార్డు
అమెరికా కాంగ్రెస్ బరిలో భారత సంతతి విద్యావేత్త పియా దాండియా రికార్డు

Pia Dandia: అమెరికా కాంగ్రెస్ బరిలో భారత సంతతి విద్యావేత్త పియా దాండియా రికార్డు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 19, 2026
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా కాంగ్రెస్ ఎన్నికలపోరులో భారత సంతతికి చెందిన విద్యావేత్త పియా దాండియా కీలక విజయం సాధించారు. ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ డెమొక్రాటిక్ ప్రైమరీలో మంగళవారం జరిగిన ఎన్నికల్లో న్యాయవాది కేసియా ఎర్లీపై ఆమె గెలుపొందారు. దీంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు పియా దాండియాకు మార్గం సుగమమైంది. సాధారణ ఎన్నికల్లో ఆమె రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి,వ్యాపారవేత్త,మెరైన్ వెటరన్ కేసీ అస్కార్‌ను ఎదుర్కోనున్నారు. ప్రైమరీలో విజయం సాధించిన అనంతరం పియా దాండియా స్పందించారు. తన స్వరాష్ట్రమైన ఫ్లోరిడా నుంచి యూఎస్ కాంగ్రెస్‌కు డెమొక్రాటిక్ నామినీగా నిలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. శ్రామిక కుటుంబాల తరఫున పోరాడేందుకు తమ ప్రచారం ఇప్పుడు తదుపరి దశలోకి అడుగుపెట్టిందని పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పియా దాండియా చేసిన ట్వీట్ 

వివరాలు 

ఎవరీ పియా దాండియా?

పియా దాండియా ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో జన్మించారు.

ఆమె తొలి తరం అమెరికన్. ఉపాధ్యాయురాలిగా తన కెరీర్‌ను ప్రారంభించిన పియా దాండియా.. కేవలం 28 ఏళ్ల వయసులోనే హార్లెమ్‌లో ఒక హైస్కూల్‌ను స్థాపించారు.

దీంతో దేశంలోనే అత్యంత పిన్న వయస్కులైన హైస్కూల్ ప్రిన్సిపాల్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందారు.

ఆ తర్వాత ఆమె వైట్ హౌస్‌లోని డొమెస్టిక్ పాలసీ కౌన్సిల్, విద్యాశాఖల్లో వైట్ హౌస్ ఫెలోగా బాధ్యతలు నిర్వర్తించారు.

అంతేకాకుండా ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్‌లో విద్య, వైద్య రంగాలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పనిచేశారు.

కాంగ్రెస్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఫ్లోరిడా నుంచి యూఎస్ కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి దక్షిణాసియా అమెరికన్‌గా పియా దాండియా చరిత్ర సృష్టించనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

నియోజకవర్గంలో కీలక అంశాలు

పునర్విభజన అనంతరం ఏర్పడిన ఫ్లోరిడా 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్‌లో బ్రొవార్డ్,పామ్ బీచ్,హెండ్రీ, కొల్లియర్ కౌంటీలు ఉన్నాయి.

ఈనియోజకవర్గంలో పియా దాండియా ప్రచారం ప్రధానంగా ప్రజల రోజువారీ అవసరాలకు సంబంధించిన అంశాల చుట్టూ సాగుతోంది.

నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడం,ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడం, వృత్తి విద్యా శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం,సోషల్ సెక్యూరిటీని కాపాడటం వంటి అంశాలను ఆమె తన ప్రధాన ఎన్నికలహామీలుగా ముందుకు తీసుకెళ్తున్నారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పియా దాండియా,రిపబ్లికన్ అభ్యర్థి కేసీ అస్కార్‌తో తలపడనున్నారు.

ఈ నియోజకవర్గం ఫలితం అమెరికా ప్రతినిధుల సభలో డెమొక్రాట్లు,రిపబ్లికన్ల మధ్య ఆధిపత్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దీంతో 22వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ ఎన్నికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

ADVERTISEMENT