Indian-American : ఓక్లహోమాలో 59 ఏళ్ల భారతీయ-అమెరికన్ మృతి
ఓక్లహోమాలో 59 ఏళ్ల భారతీయ-అమెరికన్ వ్యక్తి ముఖంపై మరొక వ్యక్తి కొట్టడంతో మరణించాడు. ఈ సంఘటన జూన్ 22న దాదాపు రాత్రి 10 గంటలకు జరిగింది. పోలీసులను ఇంటర్‌స్టేట్ 40 , మెరిడియన్ అవెన్యూ సమీపంలోని మోటెల్ పార్కింగ్ స్థలానికి పిలిచారు. మీడియా కధనాల ప్రకారం, బాధితుడిని హేమంత్ మిస్త్రీగా గుర్తించారు. మృతుడు మోటల్ మేనేజర్ గుజరాత్ కు చెందిన మిస్త్రీ ,41 ఏళ్ల రిచర్డ్ లూయిస్, అనే నిందితుడిని అక్కడి నుంచి వెళ్లిపోమని కోరాడు. దానికి అతను నిరాకరించడంతో అతనిపై పిడిగుద్దులు కురిపించాడు. లూయిస్ తీవ్రంగా కొట్టడంతో మిస్త్రీ స్పృహతప్పి పడిపోయాడని పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు.
మిస్త్రీ మృతికి కారణాలు తెలియదన్న ఓక్లహోమా పోలీసులు
అతను జూన్ 23 న దాదాపు రాత్రి 7.40 గంటలకు మరణించాడు. నిందితుడు లూయిస్ ను తరువాత మెరిడియన్ అవెన్యూలోని 1900 బ్లాక్‌లోని ఒక హోటల్‌లో పోలీసులు వెతికి పట్టుకున్నారు. జూన్ 24న, తీవ్రమైన దాడి, మరణానికి కారకుడన్న ఫిర్యాదుపై ఓక్లహోమా కౌంటీని జైలులో $100,000 బాండ్‌పై ఉంచారు. ఓక్లహోమా సిటీ పోలీసులు మీడియాతో మాట్లాడారు. నిందితుడిని ఘటనా స్ధలం నుంచి మిస్త్రీ ఎందుకు వెళ్లమన్నారో అస్పష్టంగా ఉంది. అయితే లూయిస్ వెళ్లిపోవడానికి ఇష్టపడలేదని తెలిపారు. మిగతా విషయాలు తదుపరి విచారణలో తెలుస్తాయన్నారు