NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ₹ 8,300 Crore Fraud : అమెరికా చరిత్రలో అతిపెద్ద కార్పొరేట్ నేరాలకు పాల్పడిన రిషీ షా బృందం 
    తదుపరి వార్తా కథనం
    ₹ 8,300 Crore Fraud : అమెరికా చరిత్రలో అతిపెద్ద కార్పొరేట్ నేరాలకు పాల్పడిన రిషీ షా బృందం 
    అమెరికా చరిత్రలో అతిపెద్ద కార్పొరేట్ నేరాలకు పాల్పడిన రిషీ షా బృందం

    ₹ 8,300 Crore Fraud : అమెరికా చరిత్రలో అతిపెద్ద కార్పొరేట్ నేరాలకు పాల్పడిన రిషీ షా బృందం 

    వ్రాసిన వారు Stalin
    Jul 02, 2024
    11:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త, ఔట్ కమ్ హెల్త్ సహ వ్యవస్థాపకుడు రిషీ షా (38)కు అమెరికాలోని కోర్టు ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది.

    రూ. 8,300 కోట్ల (ఒక బిలియన్ డాలర్లు) మేర వివిధ కంపెనీలను మోసగించిన కేసులో కోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది.

    అమెరికా చరిత్రలో ఇటీవలి కాలంలో అతిపెద్ద కార్పొరేట్ నేరాల్లో ఇది ఒకటిగా నిలవడం గమనార్హం.

    వివరాలు 

    ఒకప్పడు షికాగోలో బిగ్ షాట్, ఇప్పుడు బిగ్ ఛీటర్ 

    బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం 2006లో కాంటెక్ట్స్ మీడియా హెల్త్ పేరిట షా ఒక కంపెనీని నెలకొల్పాడు.

    ఆతర్వాత దాన్ని ఔట్ కమ్ హెల్త్ పేరిట మార్చాడు.వైద్యం కోసం డాక్టర్ల వద్దకు వచ్చే రోగులను ఆకర్షించేలా ఆరోగ్య రంగానికి సంబంధించిన టీవీ ప్రకటనలను ప్రచారం చేయాలనేది అతని బిజినెస్ ప్లాన్.

    ఇందుకోసం డాక్టర్ల ఆఫీసుల్లో టీవీలను ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక.ఈఆలోచన నచ్చడంతో శ్రద్ధా అగర్వాల్ అనే మహిళ ఈ సంస్థలో సహ భాగస్వామిగా మారింది.

    2010 తొలినాళ్ల నాటికి ఔట్ కమ్ హెల్త్..వైద్య పెట్టుబడుల రంగంలో బడా సంస్థగా ఆవిర్భవించింది.

    దీంతో పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు ఔట్ కమ్ హెల్త్ లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి.

    వివరాలు 

    మోసం,దగా చేయటంలో రిషి షా దిట్ట..ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్రాడ్ పర్డీ 

    దీంతో షికాగోలో రిషీ షా ఓ దిగ్గజంగా ఎదిగాడు.కానీ క్రమంగా వ్యాపారం దెబ్బతినడంతో షా,అగర్వాల్, కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్రాడ్ పర్డీ పెట్టుబడిదారులను మోసం చేయడం మొదలుపెట్టారు.

    సంస్థ కార్యకలాపాలు,ఆర్థిక పరిస్థితి గురించి దొంగ లెక్కలను పెట్టుబడిదారులు, క్లయింట్లు, రుణదాతలకు చూపుతూ వారిని తప్పుదోవ పట్టించారు.

    సంస్థ సామర్థ్యంకన్నా ఎక్కువ వ్యాపారం చేస్తున్నట్లు తప్పుడు గణాంకాలు రూపొందించారు.

    అందుకు అనుగుణంగా వ్యాపారాన్ని విస్తరించాల్సి ఉందంటూ ఫార్మా దిగ్గజ సంస్థ నోవో నోర్డిస్క్ ఏఎస్ తోపాటు ఇతర సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు సమీకరించారు.

    ఇలా వచ్చిన డబ్బుతో షా విలాసాలకు అలవాటుపడ్డాడు.

    వివరాలు 

    అగర్వాల్ పై కోర్టులో కేసులు

    ప్రైవేటు జెట్ విమానాలు, పడవుల్లో విదేశీ టూర్లకు వెళ్లడం, 10 లక్షల డాలర్లతో ఇల్లు కొనుక్కోవడం వంటివి చేశాడు.

    2016లో, షా నికర విలువ $4 బిలియన్ల కంటే ఎక్కువగా ఉంది.ఈ తప్పుడు లెక్కల ఆధారంగా 2016లో అతని నికర ఆస్తుల విలువ 4 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

    కానీ 2017లో షా మోసాలను మీడియా బయటపెట్టడంతో అతని పతనం ప్రారంభమైంది.

    దీంతో గోల్డ్ మన్ శాచ్స్, ఆల్ఫాబెట్ లాంటి బడా కార్పొరేట్ సంస్థలు షా, అగర్వాల్ పై కోర్టులో కేసులు వేశాయి.

    487.5 మిలియన్ డాలర్ల ఫండ్ రైజింగ్ ద్వారా వారిద్దరూ 225 మిలియన్ డాలర్ల డివిడెండ్ పొందారని రుజువు చేసింది.. కానీ సంస్థ మాత్రం తీవ్ర నష్టాలు మూటకట్టుకుందని పేర్కొంది.

    వివరాలు 

    ఈ గుట్టును 2017లో బహిర్గతం చేసిన  వాల్ స్ట్రీట్ జర్నల్ మీడియా 

    మొత్తం ఈ గుట్టులన్నీ వాల్ స్ట్రీట్ జర్నల్ మీడియా 2017లో బహిర్గతం చేసింది.దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం మనీలాండరింగ్ సహా మరికొన్ని అభియోగాల కింద షాను 2023 ఏప్రిల్ లో కోర్టు దోషిగా తేల్చింది.

    షాకు 15 ఏళ్ల జైలు శిక్ష, అగర్వాల్, పర్డీలకు చెరో పదేళ్ల శిక్ష విధించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. కానీ కోర్టు మాత్రం అగర్వాల్ కు మూడేళ్లు, పర్డీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

    తాజాగా షాకు ఏడున్నరేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టులో తన నేరాన్ని అంగీకరించిన షా.. అందుకు తాను పశ్చాత్తాప పడుతున్నట్లు చెప్పాడు.

    తప్పుడు పద్ధతులతో పెట్టుబడిదారులను మోసగించినట్లు సిగ్గుపడుతున్నానని పేర్కొన్నాడు.

    వివరాలు 

    బహిరంగ క్షమాపణ 

    రిషి షా, అనారోగ్యంతో, పశ్చాత్తాపం గురించి మాట్లాడాడు . శిక్ష విధించడం సబబేనని అంగీకరించాడు.

    మోసపూరిత పద్ధతుల ద్వారా దారితీసే కార్పొరేట్ సంస్కృతిని సృష్టించానని అంగీకరించాడు.

    కంపెనీని పతనానికి గురిచేసిన దుష్ప్రవర్తనకు తాను సిగ్గుపడుతున్నానని, సిగ్గుపడ్డానని అన్నాడు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెరికా

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    అమెరికా

    3 Indian Women Killed In US: అమెరికాలో రోడ్డు ప్రమాదం...ముగ్గురు భారత మహిళలు మృతి గుజరాత్
    US-Weapons-Israel: అమెరికా ఆయుధాలను ఇజ్రాయెల్ వినియోగించడంపై యూఎస్ మండిపాటు: యూఎస్ అంతర్గత నివేదికలో వెల్లడి ఆయుధాలు
    Pro Palestina-Raised Protest: పాలస్తీనాకు మద్దతుగా హార్వార్డ్ లో ఎగిరిన జెండా...దేశవ్యాప్తంగా వర్సిటీలలో నిరసనల సెగ పాలస్తీనా
    Colmbia University-students suspended: పాలస్తీనాకు మద్దతుగా ఆందోళన చేసిన విద్యార్థులను సస్సెండ్ చేసిన కొలంబియా యూనివర్సిటీ యూనివర్సిటీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025