LOADING...
National Spelling Bee 2026: అమెరికా స్పెల్లింగ్‌ బీ విజేతగా ఇండో-అమెరికన్‌ శ్రేయ్‌ పరేఖ్
అమెరికా స్పెల్లింగ్‌ బీ విజేతగా ఇండో-అమెరికన్‌ శ్రేయ్‌ పరేఖ్

National Spelling Bee 2026: అమెరికా స్పెల్లింగ్‌ బీ విజేతగా ఇండో-అమెరికన్‌ శ్రేయ్‌ పరేఖ్

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2026
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో భారతీయ మూలాలు కలిగిన విద్యార్థి శ్రేయ్‌ పరేఖ్‌ విజేతగా నిలిచాడు. కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఇండో-అమెరికన్‌ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల శ్రేయ్‌ తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. తుది పోటీలో భారతీయ మూలాలకే చెందిన మరో పోటీదారు ఇషాన్‌ గుప్తాపై ఆధిపత్యం చాటుతూ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. పోటీల్లో భాగంగా నిర్వహించిన నిర్ణాయక రౌండ్‌లో శ్రేయ్‌ కేవలం 90సెకన్ల వ్యవధిలో 32పదాల స్పెల్లింగ్‌ను తప్పులేకుండా చెప్పి తన అసాధారణ ప్రతిభను నిరూపించాడు. గత ఏడాది నిర్వహించిన 2024 ఎడిషన్‌లో కూడా తుది దశకు చేరుకున్న అతడు,ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనతో విజేతగా అవతరించి ప్రతిష్ఠాత్మక ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.

వివారాలు 

శ్రేయ్‌కు 50 వేల డాలర్ల నగదు బహుమతితో పాటు పతకం,స్క్రిప్స్‌ కప్

ఈ విజయంతో శ్రేయ్‌కు 50 వేల డాలర్ల నగదు బహుమతితో పాటు పతకం,స్క్రిప్స్‌ కప్‌ అందనున్నాయి. అలాగే ప్రముఖ నిఘంటు సంస్థ నుంచి 2,500 డాలర్లు,విమాన ప్రయాణ సౌకర్యాల కోసం 1,000 డాలర్ల విలువైన ప్రయాణ క్రెడిట్లు,విజ్ఞాన సర్వస్వ ప్రచురణ సంస్థ నుంచి 400డాలర్ల విలువైన అధ్యయన గ్రంథాలు కూడా బహుమతులుగా లభించనున్నాయి. మూడు రోజులపాటు అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో నిర్వహించిన ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో అమెరికాలోని 50 రాష్ట్రాలు,డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా,గువామ్‌,ప్యూర్టోరికో,అమెరికా వర్జిన్‌ దీవులు,రక్షణ శాఖ ఆధ్వర్యంలోని పాఠశాలలతో పాటు ఐరోపా దేశాలు,బహమాస్‌,కెనడా,ఘనా,నైజీరియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన మొత్తం 247 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కఠినమైన పోటీ మధ్య చివరి దశకు మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు అర్హత సాధించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

90 సెకన్లలో 32 పదాలు.. స్పెల్లింగ్‌ బీ విజేతగా శ్రేయ్‌ పరేఖ్

Advertisement